IPL 2021-CSK vs KKR: ఐపీఎల్ ఫైనల్‌లో ధోనీ సేన గ్రాండ్ విక్టరీ
*కేకేఆర్‌పై భారీ విజయం సాధించిన ధోనీ సేన *27 పరుగుల తేడాతో కేకేఆర్‌పై ఘన విజయ్ *నాలుగోసారి ట్రోఫీ దక్కించుకున్న చెన్నై
IPL 2021-CSK vs KKR: ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ అసలు సిసలు కిక్ ఇచ్చింది. కేకేఆర్ పై 27 పరుగుల తేడాతో నాలుగోసారి ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కప్ అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఏ దశలోనూ కేకేఆర్ కు ఛాన్స్ ఇవ్వని ధోనీ సేన ఈ సీజన్ ను ఎగరేసుకుపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ అద్భుత పోరాటానికి బైలర్ల దూకుడు తోడవ్వడంతో విజయం చెన్నైనే వరించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ముందు 193 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. సీఎస్కే ఓపెనర్లు తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. తొలి వికెట్ గా రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులతో రాణించాడు. ఇదే క్రమంలో మరో ఓపెనర్ డుప్లెసిస్ చెలరేగి పోయాడు. 86 పరుగులు సాధించిన డుప్లెసిస్ చివరి బంతికి అవుటయ్యాడు. మరోవైపు రాబిన్ ఊతప్ప 31 పరుగులు చేయగా మొయిన్ అలీ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, శివమ్ మావి ఒక వికెట్ పడగొట్టారు.
మరోవైపు 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని ఇచ్చారు. మ్యాచ్ మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడ్డ శుభ్ మన్ గిల్, వెంకటేష్ అయ్యార్ లు అర్థశతకాలతో అదరగొట్టి మ్యాచ్ పై హోప్స్ అమాంతం పెంచేశారు. అయితే, ఈ ఇద్దరు పెవిలియన్ చేరాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కేకేఆర్ ఓపెనర్ల తర్వాత మిగిలిన బ్యాట్స్ మెన్ ఏ ఒక్కరూ కనీసం నిలబడలేకపోయారంటే చెన్నై బైలర్లు ఏ రేంజ్ లో విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. చివర్లో శివమ్ మావి 20 పరుగులు, ఫెగ్యూసన్ 18పరుగులు మాత్రమే చేశారు. మొత్తానికి ఐపీఎల్ 14వ సీజన్ ను ధోనీ సేన గ్రాండ్ విక్టరీతో ఎగరేసుకు పోయింది.