IPL 2021 29th Match PBKS vs DC : ఢిల్లీ జోరు ముందు పంజాబ్ నిలిచేనా?
IPL 2021 29th Match PBKS vs DC: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు (ఆదివారం) రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌తో డీసీ తలపడనుంది.
IPL 2021 29th Match PBKS vs DC: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు (ఆదివారం) రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 7 మ్యాచ్‌లు ఆడాయి. అయితే, పంజాబ్ కింగ్స్ 3 మ్యాచుల్లో గెలిచి, 6 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌ల్లో గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
హెడ్ టు హెడ్
ఇప్పటి వరకు ఈ రెండ్ల జట్ల మధ్య 27 మ్యాచుల్లో తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ టీం 15 మ్యాచుల్లో విజయం సాధించింది. మరోవైపు 12 మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది.
అత్యధిక స్కోర్
పంజాబ్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులు. కాగా.. ఢిల్లీపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 202 పరుగులు.
టీంల బలాబలాలు
పంబాబ్ కింగ్స్
పంజాబ్ టీమ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ చేతి గాయంతో ఈ మ్యాచ్‌లో ఆడడం కష్టంగా మారింది. నికోలస్ పూరన్ 4.66 స్ట్రైయికింగ్ రేట్‌తో 28 పరుగులు చేసి నాలుగు సార్లు డకౌట్లు అయ్యాడు. కాబట్టి డేవిడ్ మాలన్ ను టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. రిచర్డ్ సన్ కు మరో అవకాశం దొరికే అవకాశం ఉంది. మయాంక్ స్థానంలో బెంగళూరుపై ఓపెనర్‌గా ఆడిన ప్రభ్‌సిమ్రాన్ ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్‌గేల్ వరుస మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో టీమ్ భారీ స్కోరుకి పునాదులు వేస్తున్నాడు. కానీ, దీపక్ హుడా, షారూక్ ఖాన్ గత మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ హర్‌ప్రీత్ బరార్ ఆ జట్టుకి కొత్త ఆశా కిరణంలా మారాడు.
ఇక పంజాబ్ బౌలర్లలో మెరాడిత్ పవర్ ప్లేలో బాగా ఆడుతున్నాడు. మహ్మద్ షమీ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక స్పిన్నర్లు రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బరార్ అంచనాలను అందుకుంటున్నారు. బెంగళూరుతో మ్యాచ్‌లో హర్‌ప్రీత్ కేవలం 7 బంతుల్లోనే విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్దాన్ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్
డీసీ ఓపెనర్ పృథ్వీ షా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతనికి జోడీగా శిఖర్ ధావన్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్, మార్కస్ స్టాయినిస్, సిమ్రాన్ హిట్‌మెయర్ దూకుడుగా ఆడుతున్నారు. దాంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా.. ఛేదనకు దిగినా అవలీలగా ఆడుతోంది. కానీ.. స్టీవ్‌స్మిత్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ నుంచి మంచి ఆరంభం కోరుకుంటుంది.
బౌలింగ్‌లో కగిసో రబాడ విఫలమవుతున్నాడు. పవర్‌ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. స్లాగ్ ఓవర్లలో మాత్రం భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. అయితే.. ఇషాంత్ శర్మ, అవేష్ ఖాన్ మాత్రం మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. ఇక మిడిల్ ఓవర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు పడగొడుతున్నారు. కానీ.. సీనియర్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ బౌలింగ్‌లో తేలిపోతున్నాడు. మ్యాచ్‌లో ఒకటి లేదా రెండు ఓవర్లు మాత్రమే వేస్తున్నా స్టాయినిస్.. ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు.
ప్లేయింగ్ లెవన్ (అంచనా)
పంబాబ్ కింగ్స్: కె.ఎల్. రాహుల్ (కెప్టెన్, కీపర్), ప్రభాసిమ్రాన్ సింగ్ / మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్ / డేవిడ్ మలన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్ / రిచర్డ్సన్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, లలిత్ యాదవ్ / అమిత్ మిశ్రా, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్.