IPL 2020 updates: కింగ్స్ XI పంజాబ్ కొంప ముంచిన అంపైర్..తిట్టిపోస్తున్న అభిమానులు!!
IPL 2020 updates: పొట్టి క్రికెట్ లో ఒక్క బంతి లేదా ఒక్క పరుగు మ్యచ్ ఫలితాన్ని తారుమారు చేస్తాయి. ఒక్కోసారి అంపైర్ చేసిన తప్పిదానికి విజయం సాధించాల్సిన జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సరిగ్గా అదే జరిగింది.
టీ 20 అంటేనే బంతికీ..బ్యాటుకీ మధ్య సమరం. ఒక్క బంతి. లేదా ఒక్క పరుగు ఫలితాన్ని తారుమారు చేస్తుంది. హీరోలను జీరోలుగా మార్చేస్తుంది. ఇక క్రికెట్ లో అంపైర్ల పాత్రా తక్కువ కాదు. ఒక్కోసారి వారు చేసే ఒక్క చిన్న తప్పిదం మ్యచ్ ఫలితాన్ని శాసిస్తుంది. సరిగ్గా అలాంటి తప్పిదమే ఇప్పుడు కింగ్స్ పంజాబ్ టీం కొంప ముంచింది. అంపైర్ తప్పిడంతో చేతికందిన మ్యాచ్ ఒక్క పరుగుతో కోల్పోయింది పంజాబ్! ఆ ఒక్క పరుగు తేడా పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మన్ మయంక్ అగర్వాల్ శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేసింది.
ఐపీఎల్ 2020 ప్రారంభం అయి రెండురోజులే అయింది. రెండే మ్యాచ్ లు అయ్యాయి. నిన్న (ఆదివారం) జరిగిన ఢిల్లీ క్యాపిటిల్స్..కింగ్స్ XI పంజాబ్ ల మధ్య తీవ్రమైన ఉద్విగ్నతతో సాగింది. ఈ మ్యాచ్ లో విజయం రెండు జట్లతోనూ దోబూచులాడింది. తొలుత బ్యాటింగ్ లో ఢిల్లీ క్యాపిటిల్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. దానితో 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు లక్ష్యానికి చేరువలోకి వచ్చింది. రెండు ఓవర్లలో అంటే పన్నెండు బంతుల్లో 25 పరుగులు చేస్తే విజయం సాధించే స్థితిలో చేరింది. ఈ సమయంలో మయాంక్ అగర్వాల్.. జోర్డాన్ తో కలసి క్రేజులో ఉన్నాడు. అప్పటికే మయాంక్ అగర్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆడుతున్నాడు. తన తెలివైన బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వీలైనప్పుడు బలంగా బంతిని బౌండరీ దాటిస్తూ.. కుదరనపుడు సింగిల్స్..డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నాడు. అతను కచ్చితంగా మ్యాచ్ గెలిపించేస్తాడనే అందరూ అనుకున్నారు. కాని, 19 వ ఓవర్లో మూడో బంతి వద్ద ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ చేసిన తప్పిదం అందరి ఆశల మీదా నీళ్ళు చల్లింది. రాబాద వికెట్లకు దూరంగా ఫుల్‌టాస్ బంతి వేశాడు. మయాంక్ ఆ బంతిని ఎక్స్‌ట్రా కవర్ దిశలోకి నెట్టాడు. వెంటనే డబుల్ రన్స్ చేశాడు. యితే.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న క్రిస్ జోర్దాన్ సింగిల్‌ని పూర్తి చేసే క్రమంలో కీపర్ ఎండ్‌వైపు సరిగా క్రీజులో బ్యాట్ పెట్టలేదని చెబుతూ స్వ్కేర్ లెగ్ అంపైర్ నితిన్ మీనన్ ప్రకటించి. దానిని షార్ట్ రన్ గా డిక్లేర్ చేశాడు. దీంతో రెండు పరుగులు రావాల్సిన చోట ఒక్క పరుగు మాతమే వచ్చింది. తరువాత ఆఖరు ఓవర్లో మయాంక్ అవుటయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు సరిగ్గా 157 పరుగులతో నిలిచింది, ఇరు జట్లు స్కోర్ సమానం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. ఇక్కడ సూపర్ ఓవర్ లో ఢిల్లీ గెలిచింది. ఈ విధంగా అంపైర్ చేసిన తప్పుకు ఓటమి పాలైంది పంజాబ్ జట్టు. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు ఇప్పుడు అంపైర్ ను తిట్టిపోస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, పంజాబ్ కో-ఓనర్ ప్రీతిజింటాతో పాటు క్రికెట్ అభిమానులు అంపైర్‌ని దుమ్మెత్తిపోస్తున్నారు.
క్రిస్ జోర్దాన్ క్రీజు లోపల కరెక్ట్‌గానే బ్యాట్ ఉంచినట్లు తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫొటోతో సహా ట్వీట్ చేసి.. అంపైర్ తప్పిదాన్ని విమర్శించగా.. ఆ పరుగు కారణంగానే పంజాబ్ ఓడిపోయిందని అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఐసీసీ ఎలైట్ ఫ్యానల్ అంపైర్‌గా ఉన్న నితిన్ మీనన్ ఈ తరహాలో తప్పిదం చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.