IPL 2020: ఓటమికి నేనే బాధ్యుడిని : డేవిడ్ వార్నర్
IPL 2020: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం అబుదాబీ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది
IPL 2020: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం అబుదాబీ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే 51 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 36 పరుగులు, సాహా 30 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్, వరున్, రస్సెల్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కోల్‌కతా కేవలం 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది.
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శుబ్‌మన్ గిల్ 70 పరుగులు చేసే లక్ష్య చేధనలో కీలక పాత్ర పోషించించాడు. మోర్గాన్ 42 నాటౌట్ పరుగులు . సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నటరాజన్, రషీద్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. మ్యాచ్ అనంతరం .. సన్‌రైజర్ కెప్టెన్ వార్నర్ మాట్లాడుతూ.. పిచ్ స్వభావం కారణంగానే బ్యాటింగ్ తీసుకున్నానని, ఫలితంతో తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపానికి గురవ్వడం లేదని స్పష్టం చేశాడు. బ్యాట్స్‌మెన్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో 30-40 పరుగులు చేస్తే ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇందుకు తాను ఎవరినీ నిందిచాలని భావించడం లేదని, తప్పంతా తనదేనని, ఈ ఓటమికి బాధ్యతను కూడా తీసుకుంటున్నానని అన్నాడు. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడాలన్న ఆలోచనతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తాను, దాన్ని కాపాడుకోలేక పోయానని చెప్పాడు.
ముఖ్యంగా, 16వ ఓవర్ తర్వాత వేగం పెంచాల్సిన ఆటగాళ్లు ఆ పని చేయడంలో విఫలం అయ్యారని అన్నాడు. ఈ మ్యాచ్ లో దాదాపు 6 ఓవర్లు డాట్ బాల్స్ ఉన్నాయని, టీ-20లో ఇన్ని డాట్‌బాల్స్ ఉంటే, మ్యాచ్ గెలవడం కష్టమవుతుందని, తదుపరి వచ్చే మ్యాచ్‌లలో మైండ్ సెట్‌ను మార్చుకుని బరిలోకి దిగుతామని అన్నాడు.