IPL 2020: ఐపీఎల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్
IPL 2020: ఐపీఎల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ .. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ షెడ్యూల్‌పై కసరత్తుల్ని పూర్తి చేసింది. ఐపీఎల్ 2020 షెడ్యూలు నేడు విడుదల కానుంది.
IPL 2020: ఐపీఎల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ .. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ షెడ్యూల్‌పై కసరత్తుల్ని పూర్తి చేసింది. ఐపీఎల్ 2020 షెడ్యూలు నేడు విడుదల కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ గంగూలీ తెలిపారు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనున్నది. కానీ, మ్యాచ్‌ల షెడ్యూల్‌ని మాత్రం ఇంకా వెలువరించలేదు. తొలుత టోర్నీ వేదికలైన దుబాయ్, షార్జా, అబుదాబీలో భిన్నమైన కరోనా రూల్స్ ఉండటంతో షెడ్యూలు విడుదల చేయడంతో బీసీసీఐ ఆలస్యం చేసింది. గత వారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 13 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో షెడ్యూల్ ప్రకటనని వాయిదా వేసింది. అయితే.. తాజాగా చెన్నై టీమ్‌లో ఆ 13 మందికీ నెగటివ్ రావడంతో.. శుక్రవారం (సెప్టెంబరు 4) ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2020 సీజన్ మూడు వేదికల్లో మొత్తం 53 రోజులు జరగనుండగా.. 60 మ్యాచ్‌ల్ని నిర్వహించ నున్నారు. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గత సీజన్లతో పోలిస్తే అరగంట ముందే ఈసారి మ్యాచ్‌లను స్టార్ చేయబోతున్నారు.
అయితే, పూర్తిస్థాయి షెడ్యూలు విడుదల చేస్తారా? లేక భాగాలుగానా? అన్న విషయం తెలియరాలేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకపోవడంతో.. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌లో టీవీ వ్యూవర్‌షిప్ భారీగా పెరిగే అవకాశం ఉంది.