IPL 2020: ఇక్కడే తప్పు చేశాం: స్టీవ్‌ స్మిత్‌

IPL 2020: ఐపీఎల్ 2020 ద్వితీయార్థంలోకి చేరుకుంది. ఈ క్ర‌మంలో జ‌రుగుతున్న ప్ర‌తి మ్యాచ్ చాలా ఉత్కంఠ‌గా జ‌రుగుతుంది. ప్ర‌తి జ‌ట్ల గెలుపొట‌ములు త‌మ ఫ్లేఆప్ అవ‌కాశాల‌పై ప్ర‌భావం చూప‌నున్నాయి

Update: 2020-10-23 06:20 GMT

IPL 2020: ఇక్కడే తప్పు చేశాం: స్టీవ్‌ స్మిత్‌ 

IPL 2020: ఐపీఎల్ 2020 ద్వితీయార్థంలోకి చేరుకుంది. ఈ క్ర‌మంలో జ‌రుగుతున్న ప్ర‌తి మ్యాచ్ చాలా ఉత్కంఠ‌గా జ‌రుగుతుంది. ప్ర‌తి జ‌ట్ల గెలుపొట‌ములు త‌మ ఫ్లేఆప్ అవ‌కాశాల‌పై ప్ర‌భావం చూప‌నున్నాయి. ఈ త‌రుణంలో రాజస్థాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్  ఘన విజయం  సాధించింది. ఇంతకు ముందు మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ అనంత‌రం రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ స్పందించాడు. 

'మేం ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించాం. ఆదిలోనే జోఫ్రా ఆర్చర్‌ రెండు పెద్ద వికెట్లను తీశాడు. కానీ దాన్ని కొనసాగించలేకపోయాం. విజయ్‌ తెలివిగా ఆడితే.. మనీష్‌ పాండే ఆటను మా నుంచి దూరం చేశాడు. వాళ్లిద్దరూ చాలా బాగా ఆడారు. మనీష్-శంకర్ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి మా జట్టుతో సంప్రదింపులు జరిపాను. మళ్లీ ఆర్చర్‌ను బౌలింగ్‌కు దింపాలని అనుకున్నా.. కానీ అలా చేయలేదు.కొందరు ఇపుడే వద్దని సూచించారు. అందుకే ఆర్చర్‌కు ఇంకో ఓవర్ ఇవ్వాల్సింది. ఇక్కడే తప్పు చేశాం' అని అన్నాడు. అయితే, ఈ ఓటమికి కారణంపై దేన్నీ వేలెత్తి చూపలేను. ఇక్కడ చాలా మంది అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు మంచి జట్లు ఉన్నాయి. మేం వరుసగా విజయాలు సాధించలేకపోయాం. ఇకపై అన్నీ గెలవాల్సి ఉంది. ఇక ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే పాయింట్ల పట్టిక ఎలా ఉండబోతుందో తెలీదు. ఇక గెలవడం ఒక్కటే మా పని' అని స్మిత్‌ అన్నాడు.

దుబాయ్‌ వేదికగా గురువారం మ్యాచ్ లో రాజ‌స్థాన్ టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ శాంసన్ ఈ సారి ఆచీతూచీ ఆడుకుంటూ .. జ‌ట్టుకు త‌న వంతు భాగ‌స్వామ్యాన్ని అందించాడు. 26 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 36 ప‌రుగులు చేశారు. మిగిత ఆట‌గాళ్లు అనుకున్న రీతిలో ఆడ‌లేదు. అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మనీష్‌ పాండే 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సుల‌తో 83 ప‌రుగులు చేసి వీరావిహారం చేశాడు. విజయ్‌ శంకర్ కూడా అత్యుత‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో   51బంతుల్లో 6 ఫోర్లు 52 ప‌రుగులు చేసి, అజేయంగా నిలిచాడు. గెలుపులో కీల‌క ప్రాత పోషించాడు. పాండే, శంకర్‌ కలిసి 140 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పారు. ఈ ఓటమితో రాజస్థాన్‌ ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్టే. ఒకవేళ మిగతా 3 మ్యాచ్‌లు గెలిచినా 14 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు ఇతర జట్ల కన్నా మెరుగైన రన్‌రేట్‌ ఉంటేనే వీలుంటుంది.

Tags:    

Similar News