IPL 2020: క్రిస్ గేల్, రాహల్ ఏంట్రీతో.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం
IPL 2020: ఐపీఎల్ 2020 లో వరుస ఓటములు ఎదుర్కోంటున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రిస్ గేల్ రాక తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
IPL 2020: ఐపీఎల్ 2020 లో వరుస ఓటములు ఎదుర్కోంటున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రిస్ గేల్ రాక తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. గురువారం రాత్రి షార్జా స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి, తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉత్కంఠ పోరు లో.. చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య రసవత్త పోరు సాగింది. ఈ పోరులో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా చివరి బంతికి నికోలస్ పూరన్ సిక్స్ కొట్టి, పంజాబ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 3 ఫోర్లు లతో 48 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (20), శివమ్ దూబే (23) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 18 పరుగులు చేశారు. ఏబి డివిలియర్స్ కూడా ఈసారి 2 పరుగులకే అవుట్ అయ్యాడు. చివరిగా క్రిజ్ లోకి అడుగు పెట్టిన క్రిస్ మోరీస్ .. తన అద్బుతమైన ప్రదర్శనతో 8 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లుతో 25 పరుగులు చేశాడు. దీనితో జట్టు స్కోర్ మొత్తం 170 దాటింటి. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి, మురుగన్ అశ్విన్‌లు చేరో రెండు వికెట్లు తీసుకోని రాణించారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు పంజాబ్ కు శుభారంభం చేసింది. ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్సర్లులతో 61 పరుగులు చేయగా, క్రిస్‌గేల్ 45 బంతుల్లో 1ఫోర్, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి అదుర్స్ అనిపించారు. జట్టు విజయంలో ఇద్దరి హాఫ్ సెంచరీస్ కీలక పాత్ర పోషించాయి. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశారు.