IPL 2020: హైదరాబాదీ బౌలర్ సిరాజ్ విధ్వంసం
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ చుక్కలు చూపిస్తున్నాడు. తన పేస్ బౌలింగ్ తో గడగడలాడిస్తున్నారు. మొదటి రెండు ఓవర్లలో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు సిరాజ్.
రెండో ఓవర్ మూడో బంతికి రాహుల్ త్రిపాఠిని ఔట్ చేశాడు. ఆ నెక్ట్స్ బంతికే నితీష్ రాణాను కూడా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ వేసిన సిరాజ్.. మరోసారి కేకేఆర్‌పై విరుచుకుపడ్డాడు. మూడో బంతికి టామ్ బాటన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మూడు వికెట్లలో రెండు క్యాచ్‌లు కీపర్ డివిలియర్స్ క్యాచ్ పట్టగా.. రాణాను క్లీన్ బౌల్ట్ చేశాడు. సిరాజ్ విధ్వంసానికి కోల్‌కతా టీమ్ విలవిల్లాడింది. నవదీప్ సైనీ వేసిన మూడో ఓవర్‌లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(1) కూడా ఔటయ్యాడు. రెండో బంతిని భారీ షాట్ ఆడగా మిడాన్‌లో క్రిస్‌మోరీస్ చేతికి చిక్కాడు. దీంతో పదిఓవర్లో దాటే సారికి 36 పరుగులకు 5 వికెట్ కోల్పోయింది.