IPL 2020: ఆదిలోనే తడబడ్డ కోల్‌కతా .. ముంబాయి లక్ష్యం 149
IPL 2020: ఐపీఎల్ 2020 భాగంగా నేడు ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య హోరాహోరీ జరుగుతుంది. ఈ పోరుకు అబుదాబి స్టేడియం వేదిక అయ్యింది
IPL 2020: ఐపీఎల్ 2020 భాగంగా నేడు ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య హోరాహోరీ జరుగుతుంది. ఈ పోరుకు అబుదాబి స్టేడియం వేదిక అయ్యింది. కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో కోల్‌కతా బరిలో దిగింది. టాస్ గెలిచిన మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ వచ్చిన కోల్ కతాటాప్ విఫలమైంది. కానీ.. పాట్ కమిన్స్, మోర్గాన్‌లు బాధ్యతయుతమైన ఇన్నింగ్ ఆడి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్‌ను ఇచ్చారు. నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
టాప్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి(7), శుభ్‌మన్ గిల్(21), నితీశ్ రాణా(5), దినేశ్ కార్తీక్(4) పరుగులకే దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ పెవిలియన్ దారి బట్టారు. ఆండ్రీ రస్సెల్(12) ఎక్కువసేపు నిలువలేదు. దీంతో కోల్‌కత పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కమిన్స్, మోర్గాన్ ల జోడీ అదరగొట్టింది. పాట్ కమిన్స్ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు లతో 53 పరుగులు చేశాడు. కమిన్స్‌కు తోడుగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా అదరగొట్టాడు. 29 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు లతో 39 పరుగులతో రాణించడంతో కోల్‌కతా పోరాడే స్కోరు సాధించింది.
ముంబాయి బౌలర్లలో రాహుల్ చాహర్ అద్భుత బౌలింగ్ చేయడంతో ఒకే ఓవర్‌లో ఇద్దరు వికెట్లు కోల్పోయారు. అప్పటికే రెండు కీలక వికెట్లు కోల్పోయి కోల్‌కతా కష్టాల్లో ఉండగా.. నెమ్మదిగా ఆడుతూ వస్తున్న శుభమ్ గిల్, దినేశ్ కార్తీక్‌ను రాహుల్ చాహర్ వరుసగా ఒకరి తరువాత ఒకరిని పెవిలియన్ చేర్చాడు. రాహుల్ చాహర్ రెండు వికెట్లు. ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్ట్‌నైల్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. 4 ఓవర్లు వేసిన నాథన్ 51 పరుగులు ఇచ్చాడు. ఏ జట్టు గెలుస్తుందో వేచిచూడాలి.