IPL 2020: వందలోపే కట్టడి చేయాలనుకున్నాం: పొలార్డ్
IPL 2020: ఐపీఎల్ 2020లో చెన్నైకింగ్స్ అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చిప్లే ఆప్స్‌కు దూరమైంది. శుక్రవారం ముంబాయితో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ చెన్నై ఆటగాళ్లలో తడబడ్డారు. . ఒక్క సామ్ కరన్ తప్ప మిగిత ఏ ఆటగాడూ రాణించలేకపోయారు
IPL 2020: ఐపీఎల్ 2020లో చెన్నైకింగ్స్ అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చిప్లే ఆప్స్‌కు దూరమైంది. శుక్రవారం ముంబాయితో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ చెన్నై ఆటగాళ్లలో తడబడ్డారు. . ఒక్క సామ్ కరన్ తప్ప మిగిత ఏ ఆటగాడూ రాణించలేకపోయారు.
ఈ క్రమంలో ముంబాయి ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ మాట్లాడుతూ..చెన్నైని వంద పరుగుల్లోపే కట్టడి చేయాలని ముంబాయి భావించాం. కానీ అది కూదరలేదు. సామ్ కరన్ అద్భుత ప్రదర్శనతో అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చాడు. కరన్ కొరకరాని కొయ్యలా మారడంతో చెన్నై ఆ మాత్రం పరుగులు చేయగలిగిందని అన్నాడు. తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి టాప్ 5 వికెట్లను కూల్చడం గెలుపు ఓ దీమా వచ్చిందని పొలార్డ్ తెలిపాడు.
ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే బౌలింగ్‌తో చెన్నై ఆటగాళ్లు తేరుకోలేకపోయారని వ్యాఖ్యానించాడు. సమష్టి ప్రదర్శనతో ముంబై గెలిచిందని తెలిపాడు. కాగా, 5 వికెట్లు కోల్పోయి అత్యల్ప స్కోర్ నమోదు దిశగా పయనిస్తున్న సీఎస్‌కేను సామ్ కరన్ ఆ ప్రమాదం నుంచి తప్పించాడని తెలిపాడు. ఈ విజయంతో ముంబై ఢిల్లీని వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని ఆక్రమించింది. గాయం కారణంగా రోహిత్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో పొలార్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.