IPL 2020 Match 7 Updates: చెన్నైకి చుక్కలు చూపించిన ఢిల్లీ! ధోనీ సేన స్వయంకృతం!
టీ 20 టెస్ట్ మ్యాచ్ లా ఆడితే ఎలా వుంటుందో చెన్నై చూపించింది. భారీ స్కోరు చేస్తుందనుకున్న ఢిల్లీ ని చెన్నై బౌలర్లు కష్టపడి నిలువరించారు. తరువాత 175 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఏ దశలోనూ విజయాన్ని సాధించే పరిస్థితి కనిపించలేదు. మెరుపులు లేవు.. పరుగులూ లేవు. మెల్లగా ప్రారంభించారు మురళీ విజయ్.. వాట్సన్. నాలుగు ఓవర్లకు 22 పరుగులు.. పదిఓవర్లకు మూడు వికెట్లకు 47 పరుగులు ఈ లెక్కలు చాలు చెన్నై బ్యాటింగ్ ఎలా సాగిందో చెప్పడానికి డుప్లిసిస్ కొంత అడ్డుకోకుంటే వంద పరుగుల్లోనే చాప చుట్టేశేవారు. ఢిల్లీ జట్టు బౌలింగ్ లో అద్భుతమైన ప్రతిభ చూపించింది. ప్రతి బౌలర్ జాగ్రత్తగా బౌలింగ్ చేసి చెన్నై జట్టును కట్టడి చేసేశారు. సింగిల్స్ తీయడానికి ఒక దశలో చెన్నై బ్యాట్స్ మన్ ఇబ్బంది పడ్డారు. ఆల్ రౌండ్ ప్రతిభతో చెన్నై జట్టు మీద ఘన విజయం సాధించింది ఢిల్లీ జట్టు!
* అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్‌లో మురళీ విజయ్(7) తొలి బౌండరీ బాదాడు. అంతకుముందు ఈ ఓవర్‌లో వాట్సన్ రెండు పరుగులు తీశాడు. దీంతో 2 ఓవర్లకు చెన్నై స్కోర్ 9/0.
* అవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్‌లో వాట్సన్(14) ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదాడు. అలాగే మరో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో 4 ఓవర్లకు చెన్నై స్కోర్ 22/0. విజయ్(8) పరుగులతో ఉన్నాడు.
*అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్ రెండో బంతికి షేన్‌వాట్సన్(14) భారీ షాట్ ఆడబోయి హెట్‌మెయిర్ చేతికి చిక్కాడు. దీంతో చెన్నై 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అలాగే ఈ ఓవర్‌లో నాలుగు సింగిల్స్ వచ్చాయి. క్రీజులో విజయ్(10), డుప్లెసిస్(2) ఉన్నారు. 5 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 26/1
* నోర్జే వేసిన ఆరో ఓవర్‌లో తొలుత డుప్లెసిస్(9) ఒక బౌండరీ బాదగా తర్వాత నాలుగు పరుగులు వచ్చాయి. చివరి బంతికి మురళీ విజయ్(8) బంతిని గాల్లోకి లేపగా రబాడ చేతికి చిక్కాడు. దీంతో చెన్నై 6 ఓవర్లకు 34 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, గైక్వాడ్ క్రీజులో ఉన్నారు.
* 7-8-9-10 నత్తనడక ఓవర్లు వరుసగా 3-4-3-3 పరుగులు ఒక వికెట్. పదో ఓవర్లో రుతురాజ్ ఓ అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. పది ఓవర్లకు చెన్నై స్కోరు 47/3
* రుతురాజ్ ఔట్..
10 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై మూడు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఈ ఓవర్‌లో రుతురాజ్ ఓ అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ప్రస్తుతం కేదార్ జాధవ్(2), డుప్లెసిస్(15) క్రీజులో ఉన్నారు. చెన్నై విజయానికి 60 బంతుల్లో 129 పరుగులు చేయాలి.
* 11 వ ఓవర్ లో ఆరు పరుగులు.. 12 వ ఓవర్లో 7 పరుగులు.. 13 వ ఓవర్లో 11 పరుగులు... జట్టు స్కోరు మూడు వికెట్లకు 71.
* ఏడు ఓవర్లలో వందకు పైగా పరుగులు చేయాల్సిన దశలోనూ చెన్నై గేరు మార్చలేకపోయింది. ఇక 16 వ ఓవర్లో కేదార్ జాదవ్ అవుట్ అవడంతో చెన్నై పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ దశలో ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు.
* ధోనీ వచ్చినా పరిస్థితి ఏమీ మారలేదు. 18 వ ఓవర్లో డుప్లిసిస్ (43) ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై పరాజయం ఖారారు అయిపొయింది. చెన్నై స్కోరు 121 పరుగులు ఐదు వికెట్లకు
* 20 వ ఓవర్లో ధోనీ అవుట్. తరువాత వెంటనే జడేజా అవుట్. 44 పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలైంది.
చెన్నై స్కోర్ కార్డు 131/7 (20.0 ఓవర్లు), - మురళి విజయ్ 10 (15) - షేన్ వాట్సన్ 14 (16) - ఫాఫ్ డు ప్లెసిస్ 43 (35) - రుతురాజ్ గైక్వాడ్ 5 (10) - కేదార్ జాదవ్ 26 (21) - ఎంఎస్ ధోని 15 (12) - రవీంద్ర జడేజా 12 (9) - సామ్ కుర్రాన్ * 1 (2)
https://www.hmtvlive.com/live-updates/ipl-2020-match-7-live-updates-and-live-score-chennai-super-kings-vs-delhi-capitals-live-updates-and-live-scores-53876