IPL 2020: ఇరు జట్లకు చావోరేవో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీ మరో ఉత్కంఠ మ్యాచ్‌కు వేదిక కానున్నది. అబుదాబి వేదికగా చెన్నై, రాజస్థాన్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు
IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీ మరో ఉత్కంఠ మ్యాచ్‌కు వేదిక కానున్నది. అబుదాబి వేదికగా చెన్నై, రాజస్థాన్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ రెండు జట్లు ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడేసి విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. దీంతో ఎలాగైనా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి.
చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జోస్ హేజిల్‌వుడ్, పీయూష్ చావ్లా తుది జట్టులోకి వచ్చారు. డ్వేన్ బ్రావో గాయం కారణంగా దూరమయ్యడు. మరోవైపు రాజస్థాన్ ఒక మార్పు చేసింది. జయదేవ్ ఉనద్కత్‌పై వేటు పడగా.. అంకిత్ రాజపూత్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇరు జట్ల పరిస్థితి ఒకేలా ఉంది. ఇకనుంచి చావోరేవో. ఈ సీజన్లో ఇంతకుముందు తలపడిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 16 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చెన్నై జట్టు: సామ్‌కరన్, డుప్లెసిస్, షేన్‌వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, పీయూష్ చావ్లా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకుర్, జోష్ హాజిల్‌వుడ్
రాజస్థాన్ జట్టు: రాబిన్ ఉతప్ప, బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్‌స్మిత్(కెప్టెన్), జోస్‌బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి.