IPL 2020: నేడే కోల్‌కతా వర్సెస్ ముంబై.. గెలుపెవరిదో ?
IPL 2020: నేడు ఐపీఎల్ లో మరో ఉత్కంఠ పోరు జరుగునున్నది. ఎడారి దేశంలోని షేక్ జయాద్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఓ
IPL 2020: నేడు ఐపీఎల్ లో మరో ఉత్కంఠ పోరు జరుగునున్నది. ఎడారి దేశంలోని షేక్ జయాద్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఓటమితో ఖంగుతిన్న ముంబయి ఓ వైపు ఉండగా.. మరో వైపు.. తొలి మ్యాచ్‌లో ఏవిధంగానైనా.. విజయం సాధించాలని పట్టుదలతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంది. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే..
కోల్‌కతా బ్యాటింగ్ అర్డర్‌లో చాలా బాగుంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, నితీష్ రానా తదితరులతో పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కమిన్స్ ఈ జట్టుకు పెద్దదిక్కుగా నిలువనున్నారు. అలాగే ఇయాన్ మోర్గాన్ చేరికతో కోల్‌కతా చాలా బలంగా మారింది. అంతేగాక టి20 స్పెషలిస్ట్ లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ ఉన్నారు.
ఒంటిచేత్తో మ్యాచ్ ను తారుమారు చేసే సత్తా రసెల్‌కు ఉంది. ఇప్పటికే ఐపిఎల్‌లోనే అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా రసెల్ పేరు తెచ్చుకున్నాడు. అతను విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇటీవల ముగిసిన కరీబియన్ లీగ్‌లో కూడా రసెల్ మెరుపులు మెరిపించాడు. అతను ఫామ్‌లో ఉండడం కోల్‌కతాకు పెద్ద ప్లస్ పాయింటే అని చెప్పాలి. అలాగే యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కూడా ఈసారి ఐపిఎల్‌లో సత్తా చాటి టీమిండియాలో స్థానం దక్కించుకోవాలని గిల్ తహతహ లాడుతున్నాడు. కుల్దీప్ యాదవ్, రింకు సింగ్, రాహుల్ త్రిపాఠి, సిద్ధార్థ్ లాడ్, ఫెర్గూసన్ తదితరులు మరింత బలాన్ని చేరుర్చానున్నారు.
మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ముంబయి తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయి.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్, బుమ్రా, పాండ్య బ్రదర్స్, బౌల్ట్, సౌరభ్ తివారి తదితరులతో పటిష్టంగా ఉంది. చెన్నైతో జరిగి మ్యాచ్‌లో చేసి పొరపాట్లు పునరవృత్తం కాకుండా గెలుపొందాలనే పట్టుదలతో కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో బుమ్రా, హార్దిక్ లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. వారి ఫామ్‌లోకి వస్తే ముంబాయి గెలుపు ఖాయం.