IPL 2020: కోల్‌కతా ముందు ఢీలాపడ్డ ఢిల్లీ ..
IPL 2020: ఐపీఎల్ 2020 నేడు (శనివారం) కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్ హోరా హోరీగా తలపడ్డాయి. అబుదాబి వేదిక జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ అదరగొట్టింది
IPL 2020: ఐపీఎల్ 2020 నేడు (శనివారం) కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్ హోరా హోరీగా తలపడ్డాయి. అబుదాబి వేదిక జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ అదరగొట్టింది. కీలక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించింది. కోల్‌కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కాపిటల్స్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా. నిర్ణీత ఓవర్లలో 194 పరుగులు చేసింది. కానీ లక్ష్య చేధనలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్ డీలా పడ్డారు. 9 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు చేసింది.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (47), రిషబ్ పంత్ (27) మినహా ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్ చేయలేదు. ఆజింక్య రహానే 0, శిఖర్ ధావన్ 9, షిమ్రోమన్ హెట్‌మెయిర్ 10, మార్కుస్ స్టోయినిస్ 6, అక్షర్ పటేల్ 9, కాగిసో రబాడ 9, రవిచంద్రన్ అశ్విన్ 14, తుషార్ దేశ్‌పాండే 1 రన్ మాత్రమే చేశారు. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. 12 పరుగులకే 5 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి మొత్తం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ప్యాట్ కమ్మిన్స్ మూడు, లాకీ పెర్గూసన్ ఒక వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో..194 పరుగులు చేసింది. నితీష్ రాణా, సునీల్ నరైన్ అర్ధసెంచరీలతో మెరుపులతో అదరగొట్టారు. రాణా ఈ మ్యాచ్ చాలా బాగా రాణించాడు. 53 బంతుల్లో 81 (1 సిక్స్, 13 ఫోర్లు) పరుగులు చేశాడు, మరో బ్యాట్‌మెన్స్ సునీల్ నరైన్ ఢిల్లీ బౌలర్ల సమర్థవంతంగా ఎదుర్కోన్నారు. 32 బంతుల్లో 64 (4 సిక్స్‌లు, 6 ఫోర్లు) పరుగులు చేశాడు. శుభమాన్ గిల్ 9, రాహల్ త్రిపాఠి 13, దినేష్ కార్తీక్ 3 పరుగులు మాత్రమే చేయగలిగారు.
చివర్లో కెప్టెన్ మోర్గాన్ కూడా చెలరేగియాడు. 9 బంతుల్లో 17 రన్స్ చేశాడు. కోల్‌కతా 42 రన్స్‌కే 3 వికెట్లు కోల్పయిన వేళ.. నితీష్ రాణా, నరైన విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కోల్‌కతా 194 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్జీ, కసిగో రబాడ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకోవడంతో.. నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది.