IPL 2020: నిర్లక్ష్యం పనికి రాదు.. సంజూ శాంసన్ పై భారత మాజీ క్రికెటర్ అసహనం
IPL 2020: రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు అసహనం వ్యక్తం చేశాడు. సంజూ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
IPL 2020: రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ వేణుగోపాల్ రావు అసహనం వ్యక్తం చేశాడు. టీ20 క్రికెట్ అంటే ఎంతసేపు ఫోర్లు, సిక్స్‌లే కాదని చురకలంటించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో గెలిచి ప్లే ఆశలను నిలుపుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేణుగోపాల్ రావు క్రికెట్ లైవ్ షోలో మాట్లాడుతూ..ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
' సంజూ శాంసన్.. టీ20 క్రికెట్ అంటే ఫోర్లు, సిక్స్‌లే కాదు. జట్టు విజయానికి తగ్గట్టు ఆడాలి. భారీ షాట్లు ఆడలేని పరిస్థితుల్లో క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో రన్ రేట్ మెయింటేన్ చేయాలి. నిర్లక్ష్యంగా ఆడి జట్టును ఓటమికి కారణం కాకూదడని అన్నారు. గత ఏడు మ్యాచ్‌లుగా శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. వికెట్ కోల్పోయిన మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఆడితే ఏంత ప్రతిభ ఉన్నా పక్కన పెట్టేస్తారు.'అని వేణుగోపాల్ రావు సూచించాడు.
తాజా మ్యాచ్‌లో కూడా శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. ధోనీ సూపర్ క్యాచ్‌కు బ్రాంజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పేలవ షాట్లతో స్టోక్స్ (19), ఉతప్ప (4) ఔటైన క్రమంలో బాధ్యత తీసుకోవాల్సిన శాంసన్.. దీపక్ చాహర్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌కు ఏడ్జ్ తీసుకోగా.. ధోనీ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ సీజన్ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(74, 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన శాంసన్.. తరువాత 8 మ్యాచ్‌ల్లో 8, 4, 0, 5, 26, 25, 9, 0 తో దారుణంగా విఫలమయ్యాడు.