IPL 2020: 'రాయుడు' బాదుడు.. 'కూల్ కెప్టెన్' వ్యూహం అదుర్స్‌

IPL 2020: ఐపీఎల్ అంటే ఇలా ఉంటుంది. ముంబ‌యి ఇండియ‌న్స్ మ‌రియు చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ అంటే మ‌రిద్ద‌రి మ‌ధ్య పోటీకి హ‌ద్దు ఉండ‌దు. ఎంట‌ర్‌టైన్ కు కొద‌వ ఉండ‌దు

Update: 2020-09-20 07:46 GMT

 MI vs CSK Match

IPL 2020: ఐపీఎల్ అంటే ఇలా ఉంటుంది. ముంబ‌యి ఇండియ‌న్స్ మ‌రియు చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్ అంటే మ‌రిద్ద‌రి మ‌ధ్య పోటీకి హ‌ద్దు ఉండ‌దు. ఎంట‌ర్‌టైన్ కు కొద‌వ ఉండ‌దు. తొలి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్ కూల్ విక్ట‌రీ సాధించింది. చెన్నై, ముంబ‌యి మ్యాచ్ ఎప్పుడు జ‌రిగిన ఉత్కంఠ సాగుతుంది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు విజ‌యం ఎవ‌రిదో చెప్ప‌డం క‌ష్టం. ఈ మ్యాచ్ లోనూ అదే జ‌రిగింది. టాస్ గెలిచి బాలింగ్ చెన్నై ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన ముంబాయి ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 162 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు గా దిగిన క్వింట‌న్ డికాక్ , రోహిత్ శర్మ లు మంచి శుభారంభం ఇచ్చారు. కానీ త‌ర్వ‌గానే .. ఫెవిలియ‌న్ చేరుకున్నారు. ఆ త‌రువాత వ‌చ్చిన సౌర‌బ్ తివారీ త‌న‌దైన బ్యాటింగ్ శైలితో ముంబ‌యికి అండ‌గా నిలిచారు. 31 బంతుల్లో 42 ప‌రుగులు చేశారు. క్వింట‌న్ డికాక్ కూడా 20 ప‌రుగుల్లో 33 ప‌రుగులు చేశారు. సూర్య కుమార్ యాద‌వ్, సౌర‌భ్ తివారీ క‌లిసి .. ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు.

ఒక్క‌నొక్క స‌మ‌యంలో 200 పై ప‌రుగులు చేస్తారేమో అని పిలిచింది. అలాగే ఆడారు. కానీ త‌రువాత ఏమైందో తెలియ‌దు కానీ వికెట్లు ప‌డ‌టం ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ ట‌ర్న్ కావ‌డానికి కార‌ణం.. జ‌డేజా, డుప్లేసిస్‌. 16 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి ముంబయి స్కోరు136 అప్ప‌టికే 5 వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లు మాత్రం త్వ‌ర‌గానే కోల్పోయింది. ర‌వీంద్ర జ‌డేజా వేసిన 15 ఓవ‌ర్‌లో సౌర‌భ్ తివారీ భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి.. బౌండ‌రీ వద్ద డూప్లెసీస్ కు దొరికాడు. అద్భుత‌మైన క్యాచ్ తో అద‌ర‌హో అనిపించారు. ఆ త‌రువాత వ‌చ్చిన హ‌ర్దిక్ పాండ్యా .. వ‌చ్చి రాగానే 2 సిక్సులు కొట్టి మ్యాచ్ ముంబ‌యిదే రా అనిపించాడు. కానీ వెంట‌నే వికెట్ .. బౌండ‌రీ వ‌ద్ద డూప్లెసీస్‌కు దొరికిపోయాడు. ముంబాయి ఇండియ‌న్స్ ఎన్నో ఆశాలు పెట్టుకున్న కీర‌న్ పోలాండ్,కృనాల్ పాండ్యా కూడా త‌ర్వ‌గానే ఫెవిలియ‌న్ చేరుకున్నారు. ఈ త‌రుణంలో ముంబ‌యి 20 ఓవ‌ర్లు ముగిసే నాటికి 162 ప‌రుగులు చేసింది. చెన్నై బౌల‌ర్‌ల్లో ఎంగిడీ 3 వికెట్లు, జ‌డేజా, దీప‌క్ చాహ‌ర్ లు రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. శ్యామ్ క‌ర్రాన్ , పియూష్ చావ్లా చెరో వికెట్ తిశారు.

లక్ష్య చేధ‌న కోసం బ్యాటింగ్ కు దిగిన చెన్నై .. ఆదిలోనే సూప‌ర్ బ్యాట్‌మెన్స్ షెన్ వార్న్ వికెట్ కోల్పోయింది. త‌రువాత ముర‌ళి విజ‌య్ కూడా ఫెవిలియ‌న్ మార్గం ప‌ట్టారు. దీంతో ఒక్క‌సారిగా చెన్నై క‌ష్టాల్లో ప‌డింది. ఆ త‌రువాత బ్యాటింగ్ వ‌చ్చిన తెలుగు తేజం రాయుడు అదుకున్నారు. రాయుడు త‌న‌దైన శైలి ఆట‌తో చెన్నైను అదుకున్నారు. ఓ వైపు క్రీజ్‌లో నిల‌దొక్కుతూ.. పోర్లు, సిక్సుల‌తో.. సింగ‌ల్స్‌తో స్కోరు బోర్డును ప‌రిగెత్తిచారు. కేవ‌లం 33 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశారు. అందులో 6 ఫోర్లు, 2 సిక్సులు. ఈ క్ర‌మంలో డూప్లెసీస్ తో క‌లిసి 100 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. రాయుడు 48 బంతుల్లో 71 ప‌రుగులు చేసి మూడో వికెట్ గా వెనుదిగారు. అప్ప‌టికే మ్యాచ్ సీఎస్‌కే చేతుల్లోకి వ‌చ్చింది.

త‌రువాత క్రీజ్‌లోకి వ‌చ్చిన ర‌వీంద్ర నిల‌దొక్కుక లేక‌పోయాడు. వెంట‌నే అవుట్ అయ్యాడు. ఈ వికెట్ తో ముంబాయి ఇండియ‌న్స్ మ్యాచ్ త‌మ చేతిలోకి వ‌చ్చింద‌ని ఆశించింది. కానీ మైదానంలోకి వ‌చ్చిన శ్యామ్ క‌ర‌న్ వారి ఆశ‌ల‌పై నీళ్లు చల్లారు. వ‌చ్చి రాగానే.. సిక్సులు, ఫోర్లల‌తో ఆట‌ను మ‌లుపు తిప్పారు. వెంట‌నే అవుట్ అయినా.. అప్పటికే చేయ‌వ‌ల్సిన న‌ష్టం చేశారు. ఆ త‌రువాత ఎంఎస్ ధోనీ రంగంలోకి వ‌చ్చారు. ధోనీ ఆట కోసం ఫ్యాన్ ఎంత‌గానే చూశారు. కానీ ఎలాంటి ప‌రుగులు చేయ‌లేదు. కేవ‌లం 2 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నారు. ధోని ఎదుర్కున్నా తొలి బంతికే ఎంఫైర్ అవుట్‌గా నిర్ణ‌యించారు. కానీ ధోనీ రివ్యూకు వెళ్లగా.. నాట్ అవుట్‌గా తెలింది. ఆ త‌రువాత ఓవ‌ర్ లో డ్యూప్లేసిస్ ఫోర్‌ బాది.. టీంను విజ‌య తీరాల‌కు చేర్చారు. దీంతో తొలి మ్యాచ్ చెన్నై సూప‌ర్ కూల్ విక్ట‌రీ సాధించింది.

అయితే.. ఈ మ్యాచ్ గెలుపు వెనుక .. ధోని తానై న‌డిపించాడు. ర‌వీంద్ర జ‌డేజా అవుట్ అయిన త‌రువాత‌.. మైదానంలోకి ధోని అడుగుపెడుతాడని అభిమానులంద‌రూ ఆశించారు. కానీ ఎవ్వ‌రూ ఉహించ‌ని విధంగా యువ ఆట‌గాడు శ్యామ్ క‌ర‌న్ ను క్రీజ్‌లో నిలిచి చ‌క్రం దించారు. వెనుకుండి.. అండ‌గా నిలిచారు. ఈ ధైర్యంతో మైదానంలో అడుగుపెట్టిన శ్యామ్ క‌ర‌న్ రెచ్చిపోయాడు. ఆడింది త‌క్కువ బంతులైన చేయావ‌ల్సిందా చేసేశాడు. ఫోర్లు, సిక్సుల‌తో హ‌ల్ చ‌ల్ చేశాడు. ఇదంతా ధోని వ్యూహ‌మే.

Tags:    

Similar News