IPL 2020: డివిలియర్స్ దూకుడు ముందు.. బౌండరీలు చిన్నబోయాయి: స‌్మిత్
IPL 2020: ఏబీ డివిలియర్స్ విధ్వంసకర బ్యాటింగ్ ఇన్నింగ్స్‌తో ఓడే మ్యాచ్‌లో ఆర్‌సీబీ సూపర్ విక్టరీ అందుకుంది. కేవలం 22 బంతుల్లో ఆరు సిక్సులు, ఒక ఫోర్‌తో 55 పరుగులు చేశాడు. దీంతో బెంగళూర్ 8 వికెట్ల తేడాతో జట్టు విజయాన్ని అందుకుంది.
IPL 2020: ఏబీ డివిలియర్స్ విధ్వంసకర బ్యాటింగ్ ఇన్నింగ్స్‌తో ఓడే మ్యాచ్‌లో ఆర్‌సీబీ సూపర్ విక్టరీ అందుకుంది. కేవలం 22 బంతుల్లో ఆరు సిక్సులు, ఒక ఫోర్‌తో 55 పరుగులు చేశాడు. దీంతో బెంగళూర్ 8 వికెట్ల తేడాతో జట్టు విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో గెలిచే మ్యాచ్‌లో ఓటమి పాలయ్యామని అన్నారు. ఈ పరాభవంతో నిరాశ పడటం లేదని అన్నారు.
ఈ ఓటమి మాకు మింగుడు పడని అంశం. ఆఖరి వరకు మేం గెలుపు రేసులో ఉన్నాం. కానీ ఏబీడీ మా విజయాన్ని లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాం. కానీ ఏబీడీ మాత్రం తన స్పెషల్ బ్యాటింగ్ తో ఆర్‌సీబీ ని గెలుపు తీరంలో నిలపెట్టాడు.జయదేవ్ ఉనాద్కత్ కట్టడి చేశాడు అనుకున్నాం.. సాధ్యం కాలేదు. డివిలియర్స్ దూకుడు ముందు పెద్ద బౌండరీలు కూడా చిన్నబోయాయి అని స్మిత్ అన్నారు.
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 పరుగులు, రాబిన్ ఊతప్ప 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులతో రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు, క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఆర్‌సీబీ ఈ గెలుపుతో మూడో స్థానంలోకి దూసుకెళ్లగా రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.