IPL 2020: చెన్నైకు మరో పెద్ద షాక్.. బ్రావో దూరం కానున్నాడా !?
IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీ ఆరంభం నుంచే చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది
IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీ ఆరంభం నుంచే చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, ఆల్‌రౌండర్ బ్రేవో కుడి కాలి తొడ కండరాల గాయంతో చెన్నై ఆడే తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ఎన్ని మ్యాచ్ లకు దూరం అవుతాడనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అతడు కోలుకోవడానికి కొద్ది రోజులు లేదా రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని ఫ్లెమింగ్ వెల్లడించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో బ్రేవో గాయపడ్డాడు. తన ఓవర్ల కోటాను పూర్తి చేయకుండానే గ్రౌండ్ వీడిచి వెళ్లిపోయాడు.
చెన్నై సూపర్‌కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ వెళ్లిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సమయంలో అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి ధావన్ సింగిల్ తీయగా, అక్షర్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పాడు. ఇక నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన అక్షర్.. ఐదో బంతికి మరో సిక్స్ కొట్టి ఢిల్లీని గెలిపించాడు.