IPL 2020: ఢిల్లీ బౌలర్ల ముందు బెంగళూర్ బ్యాట్స్ మెన్స్ బేజారు..
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ లు తలపడ్డాయి. ఈ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలిచింది
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ లు తలపడ్డాయి. ఈ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో గెలుపొంది.. తన ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. ఈ గెలుపుతో పాయింట్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఢిల్లీ ఆటగాళ్లు మంచి జోష్‌లో ఉన్నారు. ఓపెనింగ్ బ్యాటింగ్ వచ్చిన పృథ్వీషా, స్టాయినీస్ శుభారంభం చేశారు. పవర్ ఫ్లే లో ప్రత్యర్థి బౌలర్ల పై పృథ్వీషా విరుచుక పడ్డాడు. కేవలం 23 బంతుల్లో 5 ఫోర్లు, 2భారీ సిక్సులతో 42 పరుగులు చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 28 బంతుల్లో 3 ఫోర్లుతో 32 పరుగులు చేశాడు. తొలి వికెట్‌కు 68 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తరువాత వచ్చిన స్టాయినీస్ కూడా చాలా బాగా ఆడాడు. తన మెరుపు ఇన్నింగ్స్ తో ఢిల్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన రిషభ్ పంత్ కూడా మెరుపు షాట్‌లు ఆడి.. మంచి స్కోర్‌ను అందించారు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. ఇలా ప్రతి బ్యాట్ మెన్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బెంగళూర్ ముందు 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ బాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించడంలో ఫెయిలయ్యారు. మూడో ఓవర్ చివరి బంతికి మంచి ఫామ్‌లో ఉన్న దేవదత్ పాడికల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీని తరువాత, ఆరోన్ ఫించ్ కూడా అవుట్ అయ్యాడు. పవర్‌ప్లేలోనే దేవదత్ పడిక్కల్ (4), అరోన్ ఫించ్ (13), డివిలియర్స్ (9) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. కోహ్లీ కాసేపు వేగం కనబరిచాడు. అయితే రబాడ వేసిన 14వ ఓవర్లో విరాట్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో దాదాపుగా ఓటమి ఖాయమైంది.
తర్వాత వచ్చిన ఏ ఆటగాడు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మొయిన్ అలీ(11) శివం దూబే(11) స్వల్ఫ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. దీంతో బెంగళూరు ఓడిపోయింది.. ఢిల్లీ బౌలర్ రబడ నాలుగు వికెట్లు తీసి ఆర్సీబీని కొలుకోలేని దెబ్బతీశాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్(2/18), నోర్ట్జే(2/22) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.