ఢిల్లీ లక్ష్యం 153 పరుగులు!

ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న రసవత్తరమైన పోరులో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.. అయితే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు ఓపెనర్లు ఫిలిప్‌, పడిక్కల్‌ మొదట్లో వరుస బౌండరీలతో హోరెత్తించారు..

Update: 2020-11-02 15:51 GMT

ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న రసవత్తరమైన పోరులో బెంగుళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.. అయితే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు ఓపెనర్లు ఫిలిప్‌, పడిక్కల్‌ మొదట్లో వరుస బౌండరీలతో హోరెత్తించారు.. అయితే నాలుగవ ఓవర్లలో రబాడ వేసిన తొలి బంతికి భారీ షాట్ కి ప్రయత్నించిన ఫిలిప్(12) అవుట్ అయ్యాడు..

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లి. పడిక్కల్‌ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ ని పెంచారు. ఈ క్రమంలో అశ్విన్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ బౌండరీ లైన్‌లో ఉన్న స్టాయినిస్‌ చేతికి చిక్కాడు. దీనితో 82 పరుగుల వద్ద బెంగుళూరు జట్టు రెండో వికెట్ ని కోల్పోయింది. ఇక మరోపక్కా పడిక్కల్‌ 40 బంతుల్లో 50 పరుగులను పూర్తి చేశాడు.. ఈ క్రమంలో 16 వ ఓవర్లలలో వెంటవెంటనే బెంగుళూరు రెండు వికెట్లును చేయిజార్చుకుంది..

16 వ ఓవర్ లలో నాలుగో బంతికి పడిక్కల్‌ క్లీన్‌బౌల్డవ్వగా, ఆఖరి బంతికి మోరిస్ (0) అవుట్ అయ్యాడు.. ఇక ఆ తర్వాత డివిలియర్స్‌ (35), దూబె (17) ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచారు. దీనితో 7 వికెట్ల నష్టానికి బెంగళూరు జట్టు 152 పరుగులు చేసింది. అటు ఈ రెండు జట్లు 14 పాయింట్లతో ఉండటంతో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ చేరిన రెండో జట్టుగా నిలుస్తుంది.

Tags:    

Similar News