Tokyo Olympics: చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్లోకి భారత్ * బెల్జియంపై తేడాతో గెలిచిన మన్‌ప్రీత్ సేన
Tokyo Olympics: భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. 41 ఏళ్ల తర్వాత పురుషుల హాకీ టీమ్ తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో బెల్జియంతో తలపడిన మన్‌ప్రీత్ సేన.. హోరాహోరీ మ్యాచ్‌లో పైచేయి సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని ఖరారు చేసింది.
రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి క్వార్టర్ రెండో నిమిషంలోనే బెల్జియం ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఏడు, ఎనిమిది నిమిషాల్లో వరుస గోల్స్ చేసిన టీమిండియా ఫస్ట్ క్వార్టర్ లో ఆధిక్యం సాధించింది. అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే బెల్జియం మరో గోల్ చేసి స్కోర్లు సమం చేసింది. ఆ తర్వాత మన్‌ప్రీత్ టీమ్ గోల్ సాధించలేకపోవడంతో రెండో క్వార్టర్ ముగిసే సమయానికి 2-2తో రెండు జట్లు సమంగా నిలిచాయి.
1980 వరకు ఎదురులేని జట్టుగా రికార్డు ఎనిమిది సార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టు.. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. భారతదేశ క్రీడా అభిమానులకు మరో పతక ఆశలను నెరవేర్చింది.