IND vs NZ: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో రెండు మార్పులు.. సెంచరీల ప్లేయర్ రీఎంట్రీ..

India vs New Zealand, 1st Test: బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Update: 2024-10-17 04:20 GMT

IND vs NZ: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో రెండు మార్పులు.. సెంచరీల ప్లేయర్ రీఎంట్రీ..

India vs New Zealand, 1st Test: బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డుపై పరుగులు సాధించాలని కోరుకుంటున్నట్లు హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడకపోవడం, అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ని ఆడించడం గమనార్హం. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆకాశ్‌దీప్‌కు బదులుగా కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశం లభించింది. గిల్ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని రోహిత్ శర్మ తెలిపాడు.

టాస్ సందర్భంగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు మాట్లాడుతూ.. మేం ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. పిచ్ కవర్లతో కప్పబడి ఉంది. బంతి ప్రారంభంలోనే ఇబ్బందిపెట్టవచ్చు. కానీ, ఈ పిచ్ స్వభావంతో బోర్డుపై పరుగులు పెట్టాలని కోరుకుంటున్నాం. మ్యాచ్‌లో ఫలితం ఉండాలని కూడా కోరుకుంటున్నాం. గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం బాగా ఆడాం. ఈ మ్యాచ్‌లో శుభమన్ గిల్, ఆకాశ్ దీప్ ఆడడం లేదు. వీరి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్‌లు చోటు దక్కించుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

రెండో రోజు మొత్తం 98 ఓవర్లు ఆడనున్నారు. నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి కాకపోతే ఆటను అరగంట పాటు పొడిగించవచ్చు. మ్యాచ్ టైమింగ్ కూడా మార్చారు. మొదటి సెషన్ 15 నిమిషాల ముందుగా అంటే ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి సెషన్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై రాత్రి 11:30 వరకు కొనసాగుతుంది. రెండవ సెషన్ 12:10 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 2:25 వరకు కొనసాగుతుంది. కాగా మూడవ, చివరి సెషన్ 2:45 నుంచి ప్రారంభమై సాయంత్రం 4:45 వరకు కొనసాగుతుంది.

బెంగళూరు టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఓ'రూర్క్.

Tags:    

Similar News