Ind vs Eng Test: లార్డ్స్ టెస్టులో భారత్ ఘనవిజయం
Ind vs Eng Test: 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై భారత్ గెలుపు * మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 364, ఇంగ్లండ్ 361 స్కోర్లు
Ind vs Eng Test: లార్డ్స్ టెస్ట్‌లో భారత్ అద్భుతం చేసింది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత బౌలర్లు మాయ చేశారు. మొదటి టెస్టు వర్షార్పణం అయి కసి మీదున్న టీమిండియా ఆటగాళ్లు రెచ్చిపోయారు. రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. చివరి రోజు టీమ్ ఇండియా పేసర్లు మాయ చేశారు.. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను బౌలర్లు ఒక్కసారిగా విజయతీరాలకు చేర్చారు. కోహ్లీసేన 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విక్టరీ సాధించింది. టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కీలకంగా వ్యవహరించారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ 361 స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 298 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దాంతో 120 పరుగులకే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కట్టడి చేశారు 4 వికెట్ల తో సిరాజ్ తన సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్ గెలుపు ఆశలకు గండికొట్టారు.
దీంతో టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఆట ఐదో రోజు భారత్ విధించిన 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు వణికించారు. ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి భారత శిబిరంలో ఆనందాన్ని నింపారు. తొలి ఓవర్ నుంచే వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. అయితే.. చివర్లో బట్లర్, రాబిన్ సన్ గంటపాటు పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసేలా కనిపించారు. అయితే.. బుమ్రా, సిరాజ్ చివర్లలో వారిద్దరినీ ఔట్ చేయడంతో భారత్ విజయం సాధించింది.