Asia Cup 2024: రేపే భారత్, పాక్ మ్యాచ్.. హోరాహోరీ పోరుకు సిద్ధం.. ఎక్కడ చూడొచ్చంటే?
Indian Team Schedule and Squad: మహిళల క్రికెట్ ఆసియా కప్ 2024 శ్రీలంక గడ్డపై ప్రారంభం కానుంది.
Indian Team Schedule and Squad: మహిళల క్రికెట్ ఆసియా కప్ 2024 శ్రీలంక గడ్డపై ప్రారంభం కానుంది. మహిళల క్రికెట్‌లో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జులై 19 నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని దంబుల్లాలో జరగనున్న ఈ టీ20 టోర్నీ కోసం అన్ని జట్లూ అక్కడికి చేరుకున్నాయి. 8 జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్‌లో, భారత మహిళల క్రికెట్ జట్టు గత ఛాంపియన్‌గా అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు 7 సార్లు ఈ టైటిల్‌ను భారత జట్టు గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తోంది.
మహిళల ఆసియా కప్ 2024లో భారత జట్టు గ్రూప్-ఏలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్ బి గురించి మాట్లాడితే, ఇందులో ఆతిథ్య శ్రీలంకతో పాటు థాయ్‌లాండ్, మలేషియా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోని దంబుల్లాలో ఉన్న రాంగిరి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ..
ఆసియా కప్‌లో టీమ్ ఇండియా తన ప్రచారాన్ని మొదటి రోజునే అంటే జులై 19న ప్రారంభించనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో అతిపెద్ద ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత, హర్మన్‌ప్రీత్ జట్టు తదుపరి రెండు గ్రూప్ మ్యాచ్‌లను యూఏఈ, నేపాల్‌తో ఆడుతుంది. పాకిస్థాన్‌తో మహిళా క్రికెట్ జట్టు మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆసియా కప్ 2024లో భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్..
మొదటి మ్యాచ్ : భారత్ vs పాకిస్తాన్, జూలై 19, రాత్రి 7 గంటలకు, దంబుల్లా
రెండవ మ్యాచ్ : ఇండియా vs UAE, జూలై 21, రాత్రి 2 గంటలకు, దంబుల్లా
మూడో మ్యాచ్ : భారత్ vs నేపాల్, జూలై 23, రాత్రి 7 గంటలకు, దంబుల్లా
జులై 26న మొదటి సెమీఫైనల్ మధ్యాహ్నం 2 గంటలకు, రెండో సెమీఫైనల్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, ఫైనల్ మ్యాచ్ జులై 28న రాత్రి 7 గంటలకు జరగనుంది.
టీమిండియా మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చు..
మహిళల క్రికెట్ ఆసియా కప్ 2024 ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. మీరు ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో చూడొచ్చు. అదే సమయంలో, మొబైల్‌లోని Disney Plus Hotstar యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌లను చూడొచ్చు.
భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), ఉమా ఛెత్రి (కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.
ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు : శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్.