ఇంగ్లాండ్ మహిళల జట్టుపై భారత్ మహిళల జట్టు విజయం

England vs India: కౌంటీ గ్రౌండ్స్‌లో తొలివన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం

Update: 2022-09-19 01:14 GMT

ఇంగ్లాండ్ మహిళల జట్టుపై భారత్ మహిళల జట్టు విజయం

England vs India: ఇంగ్లాండ్ మహిళలపై తొలి వన్డేలో టీమిండియా మహిళల జట్టు విజయభేరి మోగించింది. ఇంగ్లాండ్ కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో 7 వికెట్లతేడాతో భారత మహిళలు విజయం సాధించారు. స్మృతి మందానా, ఇండియా కెప్టన్ హర్మన్ ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ యస్తికా బాటియా అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ మహిళల జట్టును చిత్తుచేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 227 పరుగులు సాధించింది. 228 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు మూడు వికెట్లు కోల్పోయి 44 ఓవర్ల రెండు బంతుల్లో విజయ బావుటా ఎగురవేశారు.

స్మృతి మందానా సెంచరీకి సమీపిస్తున్న తరుణంలో భారీ షాట్ ఆడబోయి పెవీలియన్ బాట పట్టారు. 99 బంతులు ఎదుర్కొన్న స్మృతిమందానా 10 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 91 పరుగులు చేశారు. కెప్టన్ హర్మన్ ప్రీత్‌ కౌర్ 94 బంతులు ఎదుర్కొని 7 బౌండరీలు ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేశారు. వికెట్ కీపర్ యస్తికా బాటియా 47 బంతుల్లో 8 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు అందించారు. అత్యధిక వ్యక్తిగత పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్రపోషించిన స్మృతి మందానా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకుంది. 

Tags:    

Similar News