T20 WC 2021 IND Vs PAK: రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌

T20 WC 2021 IND Vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి.

Update: 2021-10-24 14:28 GMT

ఇండియా వెర్సెస్ పాకిస్తాన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

T20 WC 2021 IND Vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. అయితే ఆదిలోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫేస్‌ చేసిన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. హిట్టింగ్‌ చేస్తాడనుకున్న హిట్‌మ్యాన్‌ కాస్త ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌ను సమర్పించుకోవడంతో ఫ్యాన్స్‌ అంతా షాక్‌కు గురయ్యారు. అయితే.. ఆ షాక్‌ను నుంచి కోలుకునేలోపే కేఎల్‌ రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో.. టీమిండియా ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది. ఇప్పుడు భారమంతా కెప్టెన్‌ కోహ్లీపైనే ఉంది.

అంతకు ముందు టాస్‌ గెలిచిన పాక్‌.. ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో కోహ్లీసేన బ్యాటింగ్‌ చేస్తోంది. అయితే.. తాము టాస్‌ గెలిచినా తొలుత బౌలింగే ఎంచుకునేవారమని అన్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఇక.. ఇండియా టీమ్‌ చూస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, బుమ్రా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, అశ్విన్, ఠాకూర్‌కు చోటు దక్కలేదు. పాక్‌ జట్టు విషయానికొస్తే.. బాబర్‌ అజామ్‌, మహ్మద్ రిజ్వాన్‌, ఫ‌కార్‌ జమాన్, మహ్మద్ హ‌ఫీజ్‌, షోయబ్ మాలిక్‌, హరీస్ రౌఫ్, ఇమాద్‌ వసీమ్, షాదాబ్‌ ఖాన్, హ‌స‌న్‌ అలీ, షహీన్‌ షా ఆఫ్రిది, ఆసిఫ్ అలీ ఉన్నారు.

ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌పై భారత్‌దే ఘనమైన రికార్డు ఉంది. ప్రపంచకప్‌ టోర్నీల్లో 12 సార్లు భారత్‌, పాక్‌ జట్లు తలపడ్డాయి. అయితే.. ప్రతి మ్యాచ్‌ కూడా ఇండియానే గెలిచింది. టీ20ల్లో ఇప్పటివరకు 8 సార్లు ఈ రెండు జట్లు బరిలోకి దిగగా.. ఏడు సార్లు టీమిండియానే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌ను కూడా గెలవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియాపై గెలిచి చరిత్ర తిరగరాయాలని పాక్‌ భావిస్తోంది.

Tags:    

Similar News