IND vs NZ Second T20: జోరు మీదున్న టీమిండియా.. రెండో టీ20లో గెలువనుందా..!?

* రాంచీ వేదికగా నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య కీలక టీ20 మ్యాచ్

Update: 2021-11-19 11:09 GMT

IND vs NZ Second T20 Match: భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండవ టీ20 మ్యాచ్ రాంచీ వేదికగా నేడు(నవంబర్ 19) సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి టీ20 లో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టీ20 లోను గెలుపొంది టీ20 సిరీస్ ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. మొదటి టీ20 లో రోహిత్ శర్మ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో విజయంలో కీలక పాత్ర పోషించగా, సూర్య కుమార్ యాదవ్ తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.

మరోపక్క న్యూజిలాండ్ జట్టులో మొదటి టీ20 మ్యాచ్ లో గప్టిల్, చాంప్మెన్ తమ బ్యాటింగ్ తో కివీస్ కి వెన్నెముకగా నిలిచారు. ఇక ఇరు జట్ల ఆటగాళ్ళు బౌలింగ్ లో అంతగా రాణించలేక బ్యాట్స్ మెన్ నుండి పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. మరి నేడు జరగనున్న మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ ని కైవసం చేసుకుంటుందో..లేదా కివీస్ గెలుపొంది చివరి మ్యాచ్ వరకు నువ్వా నేనా అన్నట్టు సిరీస్ సాగుతుందో నేటి మ్యాచ్ తో తేలనుంది.

మ్యాచ్ వివరాలు:

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

నవంబర్ 19(శుక్రవారం)

రాత్రి 7 గంటలు

జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం, రాంచీ

2016 ప్రపంచకప్ నుండి టీమిండియా ఆడిన టీ20 మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన 17 మ్యాచ్ లలో ఓటమి పాలవగా, రెండవ సారి (ఛేజింగ్) లో ఆడిన 26 మ్యాచ్ లలో గెలుపొందింది. అంతేకాకుండా సొంత గడ్డపై 11 మ్యాచ్ లలో 10 మ్యాచ్ లలో గెలుపొంది నాలుగు టీ20 సిరీస్ లను కైవసం చేసుకుంది.

భారత జట్టు:

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్/హర్షల్ పటేల్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్/అవేష్ ఖాన్

న్యూజిలాండ్ జట్టు:

మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, టాడ్ ఆస్టిల్/ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

Tags:    

Similar News