IND vs ENG: మరికాసేపట్లో ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్..
IND vs ENG: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఇరుజట్లు
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలిచిన జట్లు ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించేందుకు సన్నద్ధమయ్యాయి. స్వంత గడ్డపై గతంలో మంచి రికార్డ్ ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో గట్టి పోటీ ఎదుర్కుంటోంది. రాజ్‌కోట్‌లో పిచ్‌లు స్పిన్‌కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లండ్‌తో తొలిటెస్టును కోల్పోయి.. విశాఖ టెస్టులో గెలిచింది. అయితే మూడో టెస్టులో కీలక బ్యాట్స్‌మెన్‌లు లేకపోవడంతో అనుభవం లేని ప్లేయర్లతోనే బరిలోకి దిగుతోంది టీమిండియా. రాహుల్ స్థానంలో సర్ఫరాజ్‌కు అవకాశం రాగా.. కేఎస్ భరత్ స్తానంలో ధృవ్ జురెల్ ఆరంగేట్ర మ్యాచ్ ఆడనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఒకే పేసర్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు ఈసారి తుది జట్టులోకి ఇద్దరు పేసర్లను తీసుకుంది. స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను తప్పించి మార్క్ వుడ్‌కు చోటు కల్పించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులూ లేవు.