India vs England: భారత్ మూడోసారి 300పైచిలుకు స్కోర్.. బౌలర్లపైనే భారం
India vs England: భారత్ మూడోసారి 300పైచిలుకు స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ ముందు 330 పరుగుల లక్ష్యం ఉంచింది.
India vs England: భారత్ జట్టు వరుసగా మూడోసారి 300పైచిలుకు స్కోరు చేసింది. ఇంగ్లాండ్ ముందు 330 పరుగుల లక్ష్యం ఉంచింది. రిషభ్ పంత్ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్య (64; 44 బంతుల్లో 5×4, 4×6) చెలరేగి ఆడారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఓపెనర్లు శిఖర్ ధావన్ (67; 56 బంతుల్లో 10×4), రోహిత్ శర్మ (37; 37 బంతుల్లో 6×4) తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. కోహ్లీ (7) త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ మిడిలాడ్డర్ బ్యాట్స్ మెన్ చెలరేగారు. దీంతో భారత్ మూడు వందలపై స్కోరు చేసింది. ఇక ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ (30) సిక్సర్లతో చెలరేగాడు. రెండో వన్డేలో 43 ఓవర్లకే 337 పరుగులను ఛేదించింది.