India vs England: ఆచితూచి ఆడుతున్న ఇంగ్లాండ్

India vs England: ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్న నిలకడగా ఆడుతున్నారు.

Update: 2021-03-26 14:19 GMT

ఇమేజ్ సోర్స్ ఇంగ్లాండ్ ట్విటర్ 

India vs England: పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. 337 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ ఓపెనర్లు శుభారాన్నిచ్చారు. జేసన్‌ రాయ్‌(55పరుగులు,52బంతుల్లో, 7ఫోర్లు,1సిక్స్)అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో బెయిర్‌ స్టో 73పరుగులతో కొనసాగుతున్నాడు. తొలి వికెట్‌కు 110 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ క్రమంలో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 16 ఓవర్‌లో మూడో బంతిని ఆడిన బెయిర్‌ స్టో పరుగు ప్రయత్నిస్తున్న క్రమంలో రోహిత్‌ అద్భుత ఫీల్డింగ్‌తో కీపర్ పంత్‌కు బంతి అందించాడు. దీంతో పంత్ వికెట్లకు గిరాటవేయడంతో జేసన్‌ రాయ్(55) రనౌటయ్యాడు. స్టోక్స్‌(31) పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తానికి ఇంగ్లాండ్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి 26 ఓవర్లలో 173 పరుగులు అవసరం. చేతిలో మరో 9వికెట్లు ఉన్నాయి. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 336పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రాహుల్ (108; 114 బంతుల్లో 7x4, 2x6) శతకం సాధించాడు. కెప్టెన్ కోహ్లీ (66; 79 బంతుల్లో 3x4, 1x6), పంత్‌(77 పరుగులు, 40 బంతుల్లో, 3ఫోర్లు,7సిక్సులు) అర్థ శతకాలతో రాణించారు. ఆఖర్లో హార్థిక్ పాండ్య (35,16బంతుల్లో) ధాటిగా ఆడాడు. దాంతో భారత్ ఇంగ్లాండ్ ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్‌కరన్, టాఫ్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags:    

Similar News