India vs England: రాణిస్తున్న భారత బ్యాట్స్‌మెన్
India vs England: టీమిండియా బ్యాట్స్ మెన్ రాణిస్తున్నారు.
India vs England: పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్స్ నిలకడగా ఆడుతున్నారు. 32 ఓవర్లకు భారత్ మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(66; 79 బంతుల్లో 3x4, 1x6) ఔటయ్యాడు. అదిల్ రషీద్ వేసిన 32వ ఓవర్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు రాహుల్(60*) అర్థసెంచరీతో రాణిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులోకి రిషభ్ పంత్ వచ్చాడు.
అంతకుముందు ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి వన్డేలో త్రుటిలో శతకం చేజార్చుకున్న ధావన్(4) రెండో వన్డేలో స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. టాప్లీ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి స్లిప్‌లో బెన్‌స్టోక్స్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ తో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సామ్‌కరన్ వేసిన తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మ(25) ఔటయ్యాడు. స్క్వేర్ లెగ్‌లో అదిల్ రషీద్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పొయాయి.
కోహ్లీ, క్రీజులోకి కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమదకరంగా మారుతున్న వీరి జోడిని విరాట్ కోహ్లీని ఔట్ చేసి అదిల్ రషీద్ వీడదీశాడు.