India vs England: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం
India vs England: పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
India vs England: పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 336పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రాహుల్ (108; 114 బంతుల్లో 7x4, 2x6) శతకం సాధించాడు. కెప్టెన్ కోహ్లీ (66; 79 బంతుల్లో 3x4, 1x6), పంత్(77 పరుగులు, 40 బంతుల్లో, 3ఫోర్లు,7సిక్సులు) అర్థ శతకాలతో రాణించారు. ఆఖర్లో హార్థిక్ పాండ్య (35,16బంతుల్లో) ధాటిగా ఆడాడు. దాంతో భారత్ ఇంగ్లాండ్ ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్‌కరన్, టాఫ్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి వన్డేలో త్రుటిలో శతకం చేజార్చుకున్న ధావన్(4) రెండో వన్డేలో స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. టాప్లీ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి స్లిప్‌లో బెన్‌స్టోక్స్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ తో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సామ్‌కరన్ వేసిన తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మ(25) ఔటయ్యాడు. స్క్వేర్ లెగ్‌లో అదిల్ రషీద్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పొయాయింది.
ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ తో జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(66; 79 బంతుల్లో 3x4, 1x6) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమదకరంగా మారుతున్న వీరి జోడిని అదిల్ రషీద్ వీడదీశాడు. 32వ ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రాహుల్ నికలడగా ఆడగా.. పంత్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు ఫోర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్ శతకం బాది వన్డేల్లో ఐదో సెంచరీ నమోదు చేసుకున్నాడు. అనంతరం మరో ఏనిమిది పరుగులు జోడిండి 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. ధాటిగా ఆడే క్రమంలో టామ్‌కరన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద టాప్లీ చేతికి చిక్కాడు. రాహుల్ అవుటైనా పంత్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
పాండ్య- పంత్ ఇరువురు కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. సామ్‌కరన్ వేసిన 46వ ఓవర్‌లో ఇద్దరూ కలిసి 21 పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లు మూడు సిక్సులు బాదారు. పాండ్య రెండు సిక్సర్లు బాదగా, పంత్ ఒక సిక్సు సాధించాడు. ఈ క్రమంలో పంత్ 28 బంతుల్లో అర్ధశతకం సాదించి ఊపుమీద ఉన్నాడు. అయితే టామ్‌కరన్ వేసిన 47వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి జేసన్ రాయ్ చేతికి చిక్కాడు. అది అనుమానాస్పద క్యాచ్‌గా అనిపించడంతో రివ్యూలో ఔట్‌గా తేలింది