దుబాయ్‌లో ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన క్రికెటర్లంతా అటు నుంచే అటే నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఐతే రోహిత్ మాత్రం ఇండియాకు వచ్చాడు. గాయంతో ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఐతే ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడు ఆస్ట్రేలియా వెళ్లేది అనుమానంగా మారింది. డిసెంబర్ 11న మరోసారి అతడి టెస్ట్ చేయనున్నారు. రోహిత్ శర్మ నేరుగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే టీమిండియా ఫిజియో సమక్షంలో ట్రైనింగ్ తీసుకొని ఉండుంటే టెస్ట్ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండేవాడు. ఇదంతా ఎలా ఉన్నా రోహిత్ తిరిగి ఇండియాకు రావడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయ్.
ఐతే రోహిత్‌నుతాము ఎన్‌సీఏకు వెళ్లమని చెప్పలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో హిట్ మ్యానే ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్ వచ్చాడని తెలుస్తోంది. ఐతే రోహిత్ ఇలా చేయడానికి కారణం ఉందని తెలుస్తోంది. స్వదేశానికి తిరిగి రావడానికి గాయం లేదా మరో కమిట్‌మెంట్ ఏదీ కారణం కాదట. తండ్రికి కరోనా సోకిందని అందుకే రోహిత్ ఇండియాకు తిరిగివచ్చాడని క్రికెట్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ తెలిపారు. టెస్టు సిరీస్ ఆడే ఉద్దేశం రోహిత్‌కు లేకపోతే బెంగళూరు వెళ్లి ఎన్‌సీఏలో శిక్షణ పొందేవాడు కాదని చెప్పుకొచ్చాడు.