నాలుగో టెస్టులో ఆతిధ్య ఆసీస్ పట్టుబిగిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. ఐదు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మార్కస్ హ్యారిస్ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగినా లబూషేన్‌తో కలిసి మూడో టెస్టు సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. జట్టు స్కోరు 87 పరుగుల వద్ద స్మిత్ రూపంలో భారత్‌కు భారీ వికెట్ లభించింది. అయితే, మాథ్యూ వేడ్‌తో కలిసి లబూషేన్ 204 బంతుల్లో 108 పరుగులు చేసి అద్భుత శతకం సాధించాడు. మూడో సెషన్‌లో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో రహానే సేన ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్ , కెప్టెన్ పైన్ క్రీజులో ఉన్నారు. అరంగేట్ర బౌలర్ నటరాజన్ రెండు వికెట్లు, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.