India Vs Australia 3rd test : ముగిసిన తొలిరోజు ఆట..ఆసీస్‌దే ఆధిపత్యం

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సీడ్నీ వేదికగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ

Update: 2021-01-07 10:41 GMT

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సీడ్నీ వేదికగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఆసీస్ ఆసీస్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి కోలుకుని మూడో టెస్టులో తిరిగి జట్టులో చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ దిగిన వార్నర్ (5) నిరాశపరచగా.. ఓపెన‌ర్ విల్ పకోస్కీ (62పరుగులు, 110 బంతుల్లో 4x4) ఆరంగేట్రంలో రాణించాడు. మార్నస్ లబుషేన్‌ (67పరుగులు, 149 బంతుల్లో 8x4) అర్ధ శతకం సాధించగా.. స్టీవ్‌ స్మిత్‌ (31పరుగులు, 64 బంతుల్లో 5x4) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్‌, నవదీప్ సైనీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఆసీస్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చాడు. అద్భుత బంతితో స్టార్ బ్యాట్స్ మెన్, ఓపెనర్ డేవిడ్ వార్న‌ర్‌ పెవీలియ‌న్‌కు పంపాడు. ఆసీస్ స్కోర్ 6 పరుగుల వద్ద సిరాజ్‌ బౌలింగ్‌లో వార్నర్‌ స్లిప్‌లో చేటేశ్వర్ పూజారా చేతికి చిక్కాడు. ఆస్ట్రేలియా 7 ఓవర్ల తర్వాత వరణుడు అడ్డుపడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో నిర్ణీత సమయానికి ముందే భోజన విరామ సమయం ప్రకటించారు. ఓపెనర్ పకోస్కీ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ జార విడిచాడు. దీంతో ఇద్దరూ ఆసీస్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. హాఫ్ సెంచరీ తర్వాత ధాటిగా ఆడుతున్న పకోస్కీని నవదీప్ సైనీ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్‌ తీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మీత్ మరో వికెట్ భారత్ కు దక్కనియకుండా వ్యూహాత్మకంగా ఆడాడు.

Tags:    

Similar News