Ind vs Aus : ఆసీస్ టార్గెట్ 162 పరుగులు!

ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్లను కోల్పోయి 161 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకి ఓపెనర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి దారుణంగా నిరాశపరిచారు

Update: 2020-12-04 10:22 GMT

ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్లను కోల్పోయి 161 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకి ఓపెనర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి దారుణంగా నిరాశపరిచారు. శిఖర్‌ ధావన్(1)‌, కోహ్లీ (9) పరుగులకి ఔటయ్యారు. దీనితో ఆదిలోనే భారత్ కి రెండు బిగ్ షాక్ లు తగిలాయి. ఆ తరవాత సంజు శాంసన్‌, కేఎల్ రాహుల్ ఇద్దరు మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. విలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టును ముందుండి నడిపించారు. ఈ క్రమంలో 11 ఓవర్ లో హెన్రిక్స్‌ వేసిన తొలి బంతిని భారీ షాట్ కి ప్రయత్నించి శాంసన్‌ (23) ఔట్‌ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన మనీష్‌ పాండే (2) కూడా వెంటనే ఔట్‌ అయ్యాడు. కానీ రాహుల్ మాత్రం నిలకడగా ఆడుతూ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో హెన్రిక్స్‌ వేసిన 13.5వ ఓవర్‌ లో భారీ షాట్‌ కి ప్రయత్నించి రాహుల్(51) అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ చివర్లో జేడేజా వరుస బౌండరీలతో జట్టు స్కోర్ ని పరుగులు పెట్టించాడు. దీనితో నిర్ణిత 20 ఓవర్లలో భారత జట్టు ఏడూ వికెట్లను కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలలో హెన్రిక్స్‌ 3, స్టార్క్ 2, జంపా, స్వేప్సన్ చెరో వికెట్ పడగొట్టారు. 

Tags:    

Similar News