IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే.. తొలిసారి స్వ్కాడ్‌లో చేరిన ఐపీఎల్ సెన్సెషన్..

India squad for 1st test vs Bangladesh: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టులో తొలిసారిగా ఓ పేసర్ చోటు దక్కించుకున్నాడు. అదే సమయంలో, రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.

Update: 2024-09-09 04:35 GMT

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే.. తొలిసారి స్వ్కాడ్‌లో చేరిన ఐపీఎల్ సెన్సెషన్..

India squad for 1st test vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబరు 19 నుంచి 23 వరకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌కు భారత జట్టు తొలిసారిగా పిలుపునిచ్చింది. వీరితో పాటు చాలా కాలంగా రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా కూడా మొదటి టెస్ట్ ఆడనున్నారు.

మళ్లీ వచ్చిన రిషబ్ పంత్..

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 21 నెలల సుదీర్ఘ కాలం తర్వాత బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. డిసెంబర్ 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ జట్టుకు దూరమయ్యాడు. అయితే, అతను ఈ సంవత్సరం జరిగిన T20 ప్రపంచ కప్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు పునరాగమనం చేశాడు. టోర్నమెంట్‌ను భారత్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్‌లోనూ తన వైఖరిని ప్రదర్శించేందుకు పంత్ సిద్ధమయ్యాడు. దీని కోసం అభిమానులు కూడా ఎదురుచూశారు. అయితే, రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ధృవ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

యశ్ దయాళ్‌కి తొలిసారి అవకాశం..

26 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌ను భారత జట్టు తొలిసారిగా పిలిచింది. యశ్ దయాల్ దులీప్ ట్రోఫీలో భారత్-బి జట్టుతో ఆడుతున్నాడు. భారత్-ఎతో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. యశ్ దయాల్ ఫస్ట్ క్లాస్ గణాంకాలను పరిశీలిస్తే, అతను ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడుతూ 76 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. మ్యాచ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 9/121గా నిలిచింది.

ఈ ఆటగాళ్లు కూడా జట్టులోకి..

దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తొలి టెస్టు జట్టులో ఉన్నారు. అదే సమయంలో స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోలేదు. దీంతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సర్ఫరాజ్ ఖాన్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.


Tags:    

Similar News