WTC Final: 6 రోజుల టెస్ట్‌పై ఐసీసీ కీలక ప్రకటన... ఆ రూమర్స్‌కి చెక్!

WTC Final: సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ల మధ్య జూన్ 18న డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2021-05-28 14:45 GMT
భారత్, న్యూజిలాండ్ టీంలు (ఫొటో ట్విట్టర్)

WTC Final: సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ల మధ్య జూన్ 18న డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సంబంధించిన రూల్స్‌ను ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే.. ఆరవ రోజు ఆట కొనసాగిస్తారని ఇటీవల పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఐసీసీ స్పందించినట్లు తెలుస్తోంది.

ఐసీసీ వెల్లడించిన రూల్స్ మేరకు.. ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలకుండా.. డ్రాగా ముగిసినా లేదా టై అయినా భారత్, న్యూజిలాండ్ టీంలను సంయుక్త విజేతలుగా వెల్లడించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కి రిజర్వ్ డే ఉంటుంది. అయితే 5 రోజుల్లో 30 గంటల కంటే తక్కువ ఆట జరిగినట్లయితే.. అప్పుడే రిజర్వ్ డే రోజు ఆటపై నిర్ణయం తీసుకుంటాం. డబ్ల్యూటీసీ ఆరంభానికి ముందే ఈ రూల్స్ పై ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఆ రూల్స్‌కే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.

టెస్టు ఛాంపియన్‌షిప్ 2019, ఆగస్టు 1 నుంచి మైదలైంది. ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఇలా మొత్తం 9 దేశాలు ఈ ఛాంపియన్‌షిప్ లో పోటీపడ్డాయి. ప్రతి టీం సొంతగడ్డపై 3 టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై 3 సిరీస్‌లు ఆడేలా ప్లాన్ చేశారు. కానీ, కరోనా వైరస్ తో చాలా టీంలు మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో పాయింట్ల విధానానికి చెక్‌‌ చెప్పిన ఐసీసీ.. విజయాల శాతం ఆధారంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు టీంలను ఎంపిక చేసింది. దీంట్లో టీమిండియా 72.2 శాతం విజయాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే న్యూజిలాండ్ 70.0 శాతం విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.

కాగా, జూన్ 2న ఇంగ్లాండ్‌ దేశానికి బయలుదేరనుంది టీం ఇండియా. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌‌లో తలపడనుంది. ఈ మేరకు 20 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు. ఇప్పటికే ముంబయికి చేరుకున్న ఆటగాళ్లు... క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తరువాత స్పెషల్ ఛార్టర్ ప్లైట్‌లో ఇంగ్లాండ్‌ కి వెళ్లనున్నారు.

Tags:    

Similar News