IND vs ENG: కోహ్లీనే ట్రోల్ చేస్తారా.. ఇంగ్లండ్ ఫ్యాన్స్‌కి ఇచ్చి పడేసిన భారత్ ఆర్మీ.. దెబ్బకు మైండ్ బ్లాంక్..!
IND vs ENG: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs ENG: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పోయిన ఇంగ్లండ్ జట్టులో సగం మంది 60 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఇందులో జో రూట్ గోల్డెన్ డక్ కూడా ఉంది. జో రూట్ ఈ వికెట్ భారతదేశానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రూట్ ఈ వికెట్ ద్వారా, విరాట్ కోహ్లీ ప్రతీకారం పూర్తయింది.
కోహ్లీని ఎగతాళి చేసిన ఇంగ్లండ్ బర్మా ఆర్మీ..
వాస్తవానికి, భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 0 పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు, ఇంగ్లండ్‌కు చెందిన బార్మీ ఆర్మీ ట్విట్టర్‌లో కోహ్లీని ట్రోల్ చేసింది. కింగ్ కోహ్లీ ఫన్నీ ఫొటోను షేర్ చేసింది. దీని కారణంగా భారత అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా మంది భారత మాజీ క్రికెటర్లు కూడా ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ ఈ జోక్ తప్పంటూ పేర్కొన్నారు. ఇంగ్లండ్ బర్మీస్ ఆర్మీ ఈ జోక్ ఎక్కువసేపు నిలవలేదు. జస్ప్రీత్ బుమ్రా అందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఇంగ్లండ్ బర్మా ఆర్మీకి దిమ్మతిరిగే కౌంటర్..
విరాట్ కోహ్లి 0 పరుగుల వద్ద అవుటైన తర్వాత, ఇంగ్లండ్ బర్మీస్ ఆర్మీ ట్విట్టర్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో కోహ్లీ గోల్డెన్ డక్ రూపంలో కనిపించాడు. ఫొటోను షేర్ చేస్తున్నప్పుడు, ఇంగ్లండ్ ఆర్మీ క్యాప్షన్‌లో, "ఉదయం నడక కోసం వెళ్ళాను" అంటూ రాసుకొచ్చింది. జస్ప్రీత్ బుమ్రా అదే స్టైల్‌లో ప్రతీకారం తీర్చుకోవడంతో భారత అభిమానుల ఆగ్రహం ఈ ఫొటోలపై చూపించారు. వాస్తవానికి, బుమ్రా జో రూట్‌ను 0 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీని తర్వాత, భారత్ ఆర్మీ ట్విట్టర్‌లో జో రూట్ ఫొటోను ఇలానే పోస్ట్ చేసింది. “ఇప్పుడే సాయంత్రం నడకకు వెళ్ళాను” అంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.
రూట్ తర్వాత బెన్ స్టోక్స్ కూడా..
విరాట్ కోహ్లీ చేసిన ఈ జోక్‌కి భారత జట్టు ఒక్కసారి కాదు రెండు సార్లు ప్రతీకారం తీర్చుకుంది. ఒకవైపు రూట్‌ను బుమ్రా 0 పరుగుల వద్ద అవుట్ చేయగా, మహ్మద్ షమీ 0 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ ను పెవిలియన్ చేర్చాడు. 10 బంతులు ఆడినా ఖాతా తెరవలేకపోయిన బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో స్టోక్స్ ఫొటోను కూడా డక్ తలకి అంటిచి సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ ఆర్మీ దెబ్బకు ఇంగ్లండ్ బర్మా ఆర్మీ కళ్లు తేలేసినట్లైంది.