IND vs AUS 2nd ODI : పోరాడి ఓడిన భారత్.. చేజారిన సిరీస్!

భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో ఆసీస్‌ జట్టు విజయం సాధించింది. ఆసీస్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్ ని కైవసం చేసుకుంది.

Update: 2020-11-29 12:10 GMT

భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో ఆసీస్‌ జట్టు విజయం సాధించింది. ఆసీస్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్ ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 390 పరుగుల లక్షాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణత 50 ఓవర్లలలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 338 పరుగులే చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కి ఓపెనర్లు మయాంక్ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌ వరుస బౌండరీలతో హోరెత్తించారు. అయితే హాజిల్‌వుడ్‌ వేసిన ఏడో ఓవర్ లో ధావన్‌(30) ఔటయ్యాడు. దీంతో భారత జట్టు 58 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ షాక్ నుంచి బయటపడకముందే భారత్ కు మరో షాక్ తగిలింది. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌(28) వెంటనే ఔట్‌ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 61పరుగులుగా ఉంది.

ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ విరాట్ కోహ్లి కొద్దిసేపు నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అలా ఇద్దరు కలిసి జట్టు స్కోర్ ని 150 పరుగులు దాటించారు. ఈ క్రమంలో హెన్రిక్స్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయస్‌ (38) స్మిత్ చేతికి చిక్కాడు. ఆ తరవాత వచ్చిన రాహుల్ కోహ్లితో జత కలిశాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బడుతూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 200 మార్క్ ని దాటేసింది.

ఇక విజయానికి.. 84 బంతుల్లో 161 పరుగులు అవసరం అనుకున్న క్రమంలో కోహ్లి (89) అవుట్ అయ్యాడు. ఇక కేఎల్‌ రాహుల్ కొద్దిసేపు పోరాడడంతో జట్టు స్కోర్ 300 మార్క్ కి చేరుకుంది. అయితే జంపా వేసిన 44 ఓవర్ లో భారీ షాట్ కి ప్రయత్నించి రాహుల్ (76) ఔట్‌ అయ్యాడు. చివర్లో జడేజా (24), హార్దిక్‌ (28) కొద్దిసేపు పోరాడినప్పటికీ అప్పటికే ఆసీస్ విజయం ఖరారు అయిపొయింది. 

Tags:    

Similar News