T20 World Cup: ఒకే గ్రూపులో భారత్-పాక్ జట్లు

T20 World Cup: భారత్, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ కిక్కిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2021-07-16 15:20 GMT

T20 World Cup: ఒకే గ్రూపులో భారత్-పాక్ జట్లు

T20 World Cup: భారత్, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ కిక్కిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. టీ-20 వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లను ఒకే గ్రూప్‌లో చేర్చడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ చూద్దాం.

ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ గ్రూప్స్‌ను ఐసీసీ ప్రకటించింది. టోర్నీలో పాల్గొనే జట్లతో గ్రూపులను ప్రకటించిన ఐసీసీ భారత్, పాకిస్తాన్‌లో ఒకే గ్రూపులో చేర్చింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆయా జట్ల స్థానాలను బట్టి వరల్డ్ కప్ గ్రూపుల్లో వాటికి చోటు కల్పించారు. టోర్నీ ప్రాథమిక దశ రెండు రౌండ్లలో సాగనుంది.

మరోవైపు ర్యాంకుల్లో టాప్-8 జట్లు నేరుగా రెండో రౌండ్‌లో ఆడనున్నాయి. ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1, గ్రూప్-2లో ఐసీసీ చేర్చింది. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లీస్ట్‌లో ఉన్న జట్లను, అర్హత పోటీల ద్వారా టోర్నీలో ప్రవేశం పొందిన జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా ఐసీసీ విభజించింది. ఇవి తొలి రౌండ్ మ్యాచ్ లు ఆడి, ఆపై సూపర్-12కు అర్హత సాధించనున్నాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరతాయి. టాప్-8 జట్లతో కలిసి ఈ 4 చిన్న టీమ్ లు కూడా సెకండ్ రౌండ్ ఆడనున్నాయి.

ఇక ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ అద్దిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ జట్లను ఒకే గ్రూపులో చేర్చడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత్, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మరోవైపు భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా వ్యాప్తి కారణంగా యూఏఈ తరలిపోయింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. త్వరలోనే టోర్నమెంట్ మ్యాచ్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించనుంది.

Tags:    

Similar News