స్మిత్ చెప్పిన మాటలు అక్షరాల నిజం : గంభీర్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతడెంతో దూరంలో లేడని అన్నాడు గంభీర్.. టీమ్‌ఇండియాను స్మిత్ అర్థం చేసుకున్నాడు. కానీ, టీమ్‌ఇండియా అతడిని అర్థం చేసుకోలేకపోయింది. స్మిత్ కేవలం 18 ఓవర్లలోనే సెంచరీ పూర్తి చేశాడు.
ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమ్‌ఇండియా జట్టు వరుసగా రెండు వన్డేలలో ఓటమి పాలు అయింది. అయితే ఈ రెండు వన్డేలలో ఆసీస్ బ్యాట్స్ మెన్ స్మిత్ వరుస శతకాలు బాది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదే విషయంపై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతడెంతో దూరంలో లేడని అన్నాడు గంభీర్.. టీమ్‌ఇండియాను స్మిత్ అర్థం చేసుకున్నాడు. కానీ, టీమ్‌ఇండియా అతడిని అర్థం చేసుకోలేకపోయింది. స్మిత్ కేవలం 18 ఓవర్లలోనే సెంచరీ పూర్తి చేశాడు. 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్ 38వ ఓవర్‌లోనే సెంచరీ చేశాడు. అయితే ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని గంభీర్ అన్నాడు. ఇక కోహ్లీ గణంకాలు ఎంత మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ రెండు మ్యాచ్‌ల్లో స్మిత్ ఆడిన తీరు, అతడు చూపించిన ప్రభావం నమ్మశక్యం కానిదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
రాబోయే మ్యాచ్ లలో స్మిత్ ఇలాగే ఆడితే మాత్రం టీమ్‌ఇండియాకు కష్టాలు ఎదురుకోవాల్సి వస్తుందని గంభీర్ అన్నాడు. స్మిత్‌ను ఔట్ చేసే విధానాన్ని టీమ్‌ఇండియా జట్టు కనుకోవ్వాలని అన్నాడు. ఇదిలా ఉంటే ఇరు జట్లు మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.