T20 World Cup: టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అంపైర్ పెద్ద త‌ప్పు.. టోర్న‌మెంట్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌

T20 World Cup: ఐసిసి టి20 ప్రపంచకప్ 2021లో బయో బబుల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది.

Update: 2021-11-02 12:10 GMT

ఎంపైర్ మైఖేల్ గౌగ్ (ఫైల్ ఇమేజ్)

T20 World Cup: `ఐసిసి టి20 ప్రపంచకప్ 2021లో బయో బబుల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో ఓ ఇంగ్లీష్ అంపైర్ బుక్ అయ్యాడు. మైఖేల్ గోఫ్ బయో బబుల్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ 6 రోజుల పాటు అత‌డిని టోర్న‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించింది. మైఖేల్ గోఫ్ ప్రపంచంలోని అత్యుత్తమ అంపైర్లలో ఒక‌రు. శుక్రవారం (అక్టోబర్ 29) గోఫ్ తన హోటల్ నుంచి అనుమతి లేకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది.

అతను బయో బబుల్ బ‌య‌ట ఉన్న వ్యక్తిని కలిశాడు. నివేదికలో ఐసిసి ప్రతినిధిని ఉటంకిస్తూ "బయో-సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు బయో-సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ అంపైర్ మైఖేల్ గోఫ్‌ను ఆరు రోజుల పాటు ఐసోలేట్ చేయమని కోరింది. ఈ కాలంలో అతను టోర్నీలో అధికారికంగా వ్యవహరించలేడని స్ప‌ష్టం చేసింది.

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో మైఖేల్ గోఫ్ ఆఫీషియ‌ల్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఈ సంఘటన తర్వాత అతన్ని తొలగించారు. అతని స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ముర్రే ఎరాస్మస్‌ను విధుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం మైఖేల్ గోఫ్ ని హోటల్ గదిలో బంధించారు. ఒక్కరోజు మినహా ప్రతిరోజు వీరిని విచారిస్తున్నారు. తదుపరి ఆరు రోజుల పాటు వారి పరీక్షలన్నీ నెగెటివ్‌గా ఉంటే వారు టోర్నమెంట్‌లో చేరతారు.

అయితే బయో బబుల్‌ను నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే వారిపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా మహమ్మారి తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ పురుషుల T20 ప్రపంచ కప్. గతేడాది ఈ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉండగా కరోనా కేసుల కారణంగా వాయిదా ప‌డాల్సి వ‌చ్చింది. దీనితో పాటు ఇటీవలి ప్రపంచ కప్ కూడా భారతదేశంలో జరగాల్సి ఉంది. అయితే అక్కడ కూడా కరోనా కేసులు రావడంతో ఈ టోర్నమెంట్ యూఏఈకి మార్చారు.

Tags:    

Similar News