ఇంగ్లాండ్ లక్ష్యం 318: ధావన్ దంచేశాడు.. కృనాల్‌ కుమ్మేశాడు

India vs England:ఇంగ్లాండ్ తో పూణే లో నేడు జరుగుతోన్నే మొదటి వన్డే లో టీమిండియా 5 వికెట్లు కొల్పోయి 317 పరుగలు చేసింది.

Update: 2021-03-23 12:22 GMT

టీమిండియా (ఫొటో ట్విట్టర్)

India vs England: ఇంగ్లాండ్ తో పూణే లో నేడు జరుగుతోన్నే మొదటి వన్డే లో టీమిండియా 5 వికెట్లు కొల్పోయి 317 పరుగలు చేసింది. ఇంగ్లీష్ టీం ముందు 318 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాటింగ్ లో తొలుత తడబడింది. తక్కువ స్కోర్ కే వికెట్లు పడిపోవడంతో.. క్రీజులో నిలదొక్కుకునేందుకే బ్యాట్స్ మెన్స్ చాలా టైం కేటాయించారు. ఆ తరువాత లయ అందిపుచ్చుకున్న బ్యాట్స్ మెన్స్ స్కోరు బోర్గును పరుగెత్తించారు. మొదట్లో ధావన్(98) ఇంగ్లీష్ బౌలర్లను దంచేయగా... మధ్యలో కోహ్లీ(56) సూపర్ ఫామ్ తో పరుగుల వరద పారించాడు. అలాగే చివర్లో రాహుల్(62) రఫ్ ఆటకు తోడు.. కృనాల్‌(58) కుమ్మేయడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ లో మొత్తం నలుగురు భారత బ్యాట్స్ మెన్స్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు.

పేలవ ఫామ్ లో ఉన్న ధావన్..ఈమ్యాచ్ లో 98 పరుగులతో రాణించాడు. కానీ, ఇంగ్లాండ్ పై మొదటి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. స్టోక్స్‌ బౌలింగ్లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో 4వ వికెట్ గా ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. మ్యాచ్‌ ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆయన.. ఆతరువాత రూటు మార్చి చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. సిక్సర్‌ బాది 68 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన అతను.. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేశాడు.

16వ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ రోహిత్‌ శర్మ(28) ఔటయ్యాడు. తన శైలికి భిన్నంగా ఆరంభం నుంచి స్లోగా ఆడిన రోహిత్..‌ 42 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. వైడ్‌ బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో హిట్ మ్యాన్ ఔటయ్యాడు.

రోహిత్ ఔటయ్యాక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. ధావన్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగెలెత్తించారు. టీ20 సిరీస్‌లో వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కోహ్లి.. వన్డే సిరీస్‌లో మరో అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 60 బంతుల్లో 6 ఫోర్లతో కెరీర్‌లో 62వ హాఫ్ సెంచరీ(56 పరుగులు) నమోదు చేశాడు. అర్థ శతకం తరువాత మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి కెప్టెన్ కోహ్లీ కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. కోహ్లీ, ధావన్ లు కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పారు.

కెప్టెన్ కోహ్లీ ఔటయ్యాక టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 34.5 వ ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్ లో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌ పట్టడంతో శ్రేయస్‌ అయ్యర్‌(9 బంతుల్లో 6; 1ఫోర్‌) వెనుదిరిగాడు. అప్పటికి టీమిండియా స్కోరు 187/3.

ఆ తరువాత హార్దిక్‌ పాండ్య(1) కూడా బ్యాటింగ్ లో నిరాశపరిచాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 41వ ఓవర్‌ మూడో బంతికి స్లిప్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 205 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది.

అనంతరం హార్దిక్‌ పాండ్య సోదరుడు కృనాల్‌ పాండ్య (58 పరుగులు, 31 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్స్)తో కలిసి కీపర్ కేఎల్ రాహుల్ (62 పరుగులు, 43 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్సులు) వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆడితూడి ఆడుతూ... స్కోరు బోర్డును పరిగెత్తించారు. వీలు చిక్కినప్పుడల్లా.. బౌండరీలు బాదుతూ.. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. తొలి వన్డే ఆడుతున్న కృనాల్‌ ఇంగ్లీష్ బౌలర్లపై వీరవిహారం చేశాడు.

ఇక ఇంగ్లాంగ్ బౌలర్లలో స్టోక్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మరో బౌలర్ మార్క్‌ వుడ్‌ 2 వికెట్లు తీశాడు. 

Tags:    

Similar News