Daniel Jarvis: ఈ మధ్య స్నేహితులపై, కుటుంబసభ్యులపై సరదా కోసం పోటీపడుతూ చేసే ఈ ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో చూడటానికి బాగానే ఉన్నా కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులను ఇబ్బంది కూడా పెడుతుంటాయి. ఇప్పటికే పలు దేశాల్లో ప్రాంక్స్ పై ఆంక్షలు ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒకరకంగా అలాంటి వీడియోలు చేస్తూ సాధారణ ప్రజలకు సైతం తలనొప్పిగా మారారు. తాజాగా అదే కోవలోకి ఇంగ్లాండ్ ప్రాంక్ స్టార్ డానియల్ జార్విస్.. తన అభిమానులు ముద్దుగా జార్వో అని పిలుచుకుంటారు. హెడ్డింగ్లి లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా జార్వి ఇండియన్ జెర్సీలో మైదానంలోకి బ్యాట్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు.
భారత ఆటగాడు రోహిత్ శర్మ ఔటైన తరువాత కోహ్లి వెంటే బ్యాటింగ్ కి దిగిన జార్వో కాసేపు హల్చల్ చేస్తూ అటు ఆటగాళ్ళకే కాకుండా అభిమానులకు షాక్ ఇచ్చాడు. వెంటనే అలెర్ట్ అయిన సిబ్బంది అతనిని గ్రౌండ్ నుండి బయటికి పంపారు. ఇలా లార్డ్స్ లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇండియా జెర్సీతో గ్రౌండ్ లోకి ఎంటరై భారత ఆటగాళ్ళతో పాటు ఫీల్డింగ్ లో పాల్గొన్నాడు. ఇలా ఒక ప్రపంచ స్థాయి క్రికెట్ మ్యాచ్ లో ప్రాంక్స్ చేయడంతో పాటు కరోనా సమయంలో బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్ళ వద్దకు వెళ్ళడంపై ఆగ్రహించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జార్వోను హెడ్డింగ్లి క్రికెట్ గ్రౌండ్ లోకి ఎంట్రీ లేకుండా జీవితకాలం నిషేధించడంతో పాటు భారీగానే జరిమానా విధించినట్లు తెలుస్తుంది. ఇక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ తో పాటు ట్విట్టర్ కమెడియన్ గా జార్వో సుపరిచితుడే.