Sachin Tendulkar: స‌చిన్ పేరును దుర్వినియోగం చేయొద్దు

Sachin Tendulkar: స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్‌కు మారుపేరు. ఆయ‌న పేరు మీద లేని రికార్డుల్లేవు. అభిమానులు ఆయ‌నను క్రికెట్ దేవునిగా భావిస్తారు. కానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరును కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని టీమిండియా మాజీ క్రికెటర్

Update: 2020-09-13 06:39 GMT

Sachin Tendulkar’s name

Sachin Tendulkar: స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్‌కు మారుపేరు. ఆయ‌న పేరు మీద లేని రికార్డుల్లేవు. అభిమానులు ఆయ‌నను క్రికెట్ దేవునిగా భావిస్తారు. కానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరును కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ)..క్రికెట్‌ అభివృద్ధి కమిటీ (సీడీసీ) చైర్మన్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పేర్కొన్నాడు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈమేరకు లాల్ చంద్ ఎంసీఏ అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌కు లేఖ రాశారు.

ఎంసీఏలో వివిధ వయస్సు గ్రూపుల జట్ల సెలెక్టర్లు, కోచ్‌ల పదవులకు రాజ్‌పుత్‌ ఆధ్వర్యంలోని సీడీసీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే కొందరు వ్యక్తులు సచిన్‌ పేరు చెప్పి కోచ్‌ల పదవులకు సిఫారసు చేస్తున్నారని రాజ్‌పుత్‌ తెలిపాడు. 'టెండూల్కర్‌ను మేం గౌరవిస్తాం. అయితే ఫలానా వ్యక్తులను ఫలానా పదవులకు సచిన్‌ సిఫారసు చేస్తున్నాడని కొందరు మాపై ఒత్తిడి తెస్తున్నారు. సచిన్ ఎవ‌రి పేరును సిఫార‌సు చేయాలేదని అన్నారు.

ఆయ‌న క్రికెట్ దేవుడు. అత‌న్ని గౌరవిస్తాం. అతను ఇచ్చే సలహాలు, సూచనలను మేం పాటిస్తామ‌ని రాజ్‌పుత్‌ పేర్కొన్నాడు. అయితే ఈ లేఖపై స్పందించిన ఎమ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అమిత్ దాని కన్వీనర్లు ముందు సీఈవో, సెక్రటరీల భేధాభిప్రాయాలను తొలగించాలని సూచించాడు.ఇలాంటి వల్లే ముంబై క్రికెట్ ప్రతిష్ట దిగజారుతుందని అసహనం వ్యక్తం చేశాడు. 

Tags:    

Similar News