IPL 2021 DC vs MI: ఎట్టకేలకు ఢిల్లీని వరించిన విజయం

IPL 2021 DC vs MI: ఐపీఎల్‌లో వరుసగా ముంబయి చేతిలో అయిదు ఓటముల తర్వాత ఢిల్లీ గెలవడం విశేషం.

Update: 2021-04-21 01:20 GMT

IPL 2021 DC vs MI:(File Image)

IPL 2021 DC vs MI: మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై ఢిల్లీ విజయం సాధించింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కి ఊహించని విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ పంచ్ ఇచ్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించేసింది. తాజా సీజన్‌లో నాలుగో మ్యాచ్ ఆడిన ఢిల్లీకి ఇది మూడో విజయంకాగా.. ముంబయికి ఇది రెండో ఓటమి.

ఢిల్లీకి మెరుగైన ఆరంభం...

138 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీకి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ పృథ్వీ షా (7: 5 బంతుల్లో 1x4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. అయితే.. సూపర్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (45: 42 బంతుల్లో 5x4, 1x6) నెం.3లో వచ్చిన స్టీవ్‌స్మిత్ (33: 29 బంతుల్లో 4x4)తో కలిసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. మ్యాచ్‌లో ఢిల్లీని మెరుగైన స్థితిలో నిలిపింది. అయితే.. టీమ్ స్కోరు 64 వద్ద స్మిత్ ఔటవగా.. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వరకూ క్రీజులో ఉన్న ధావన్ 100 పరుగుల వద్ద రాహుల్ చాహర్ బౌలింగ్ గేర్ మార్చి వికెట్ చేజార్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి మ్యాచ్‌లో పుంజుకునేందుకు ముంబయి శతవిధాల ప్రయత్నించింది.

ఆ జట్టులోనూ కాస్త టెన్షన్...

ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (7: 8 బంతుల్లో 1x4) అప్పనంగా బుమ్రాకి వికెట్ సమర్పించుకోవడంతో ఆ జట్టులోనూ కాస్త టెన్షన్ కనిపించింది. మరోవైపు ట్రెంట్ బౌల్ట్, బుమ్రా కట్టుదిట్టంగా బంతులేస్తూ.. పరుగుల, బంతులు మధ్య అంతరం పెంచేందుకు ప్రయత్నించారు. దాంతో.. కొత్త క్రికెటర్ లలిత్ యాదవ్ (22 నాటౌట్: 25 బంతుల్లో బంతుల్ని వేస్ట్ చేసేశాడు. కానీ చివర్లో క్రీజులోకి వచ్చిన సిమ్రాన్ హెట్‌మెయర్ (14 నాటౌట్: 9 బంతుల్లో 2x4) బాధ్యత తీసుకుని రెండు బౌండరీలు బాదేయడంతో ఢిల్లీ ఛేదన సులువైంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జస్‌‌ప్రీత్ బుమ్రా రెండు నోబాల్స్ విసిరి.. మొత్తంగా 10 పరుగులు సమర్పించుకోగా.. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. దాంతో.. పొలార్డ్ బౌలింగ్‌కిరాగా. . మొదటి బంతినే బౌండరీకి తరలించిన హెట్‌మెయర్.. స్కోర్లని సమం చేశాడు. అయితే.. ఆ తర్వాత బంతిని హైఫుల్ టాస్ రూపంలో పొలార్డ్ విసరగా.. దాన్ని నేరుగా ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ చేతుల్లోకి క్యాచ్‌గా హిట్‌మెయర్ కొట్టాడు. 17 పరుగుల వ్యవధిలో అయిదు ప్రధాన వికెట్లను కోల్పోయిన ముంబయి 12 ఓవర్లు ముగిసే సరికి 84/6తో కష్టాల్లో చిక్కుకుంది. కిషన్‌ (26; 28 బంతుల్లో 1×4, 1×6), జయంత్‌ (23; 22 బంతుల్లో 1×4) రాణించడంతో ముంబయి కాస్త పోటీ ఇవ్వదగ్గ స్కోరు చేయగలిగింది. 

Tags:    

Similar News