David Warner: వాళ్ళు నన్ను రిటైన్ చేసుకోరని ముందే తెలుసు.. అదే జరిగింది

* సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణయంపై స్పందించిన డేవిడ్ వార్నర్

Update: 2021-12-02 09:04 GMT

David Warner: వాళ్ళు నన్ను రిటైన్ చేసుకోరని ముందే తెలుసు.. అదే జరిగింది

David Warner: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందుగా రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం డేవిడ్ వార్నర్ ని వేలానికి వదిలేసిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ముగ్గురు ఆటగాళ్ళను మాత్రమే రిటైన్ చేసుకుంది. అందులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14 కోట్లు), యువ హిట్టర్ అబ్దుల్ సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు)లను రిటైన్ చేసుకున్నట్లు తెలిపింది. ఇటు వార్నర్ తో పాటు జానీ బెయిర్ స్టౌ, ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ ని కూడా రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం.

తాజాగా తన రిటైన్ పై స్పందించిన డేవిడ్ వార్నర్ ఇక అధ్యాయం ముగిసింది.. ఇప్పటివరకు తమకు సపోర్ట్ చేసిన అభిమానులకు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ధన్యవాదాలు చెబుతూ వార్నర్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అంతకు ముందు కూడా హైదరాబాద్ జట్టు యాజమాన్యం తనని రిటైన్ చేసుకోదని వార్నర్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలిపాడు. 2014 నుండి హైదరాబాద్ జట్టు తరపున ఆడిన వార్నర్ 95 మ్యాచులలో 4014 పరుగులు చేశాడు. గత సీజన్ లో తన బ్యాటింగ్ లో విఫలమైన వార్నర్ ని రెండో దశ ఐపీఎల్ లో తుది జట్టులోకి కూడా తీసుకోకుండా కెప్టెన్సీ నుండి తప్పించి కేన్ విలియమ్సన్ కు కెప్టెన్ గా బాధ్యతలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి త్వరలో జరగబోయే మెగా వేలంలో ఆస్ట్రేలియన్ హిట్టర్ ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాల్సిందే..!!

Tags:    

Similar News