CSK vs SRH Match Records: నేడు చెన్నైతో హైదరాబాద్ ఢీ; రికార్డులివే..

CSK vs SRH Match Records: వరుస విజయాలతో దూసుకెళ్లున్న చెన్నై టీంతో.. సీజన్‌లో చివరి స్థానంలో ఉన్న ఎస్ఆర్‌హెచ్ తలపడనుంది.

Update: 2021-04-28 10:10 GMT

నేడు చెన్నైతో హైదరాబాద్ ఢీ; రికార్డులివే..(ఫొటో ట్విట్టర్) 

CSK vs SRH Match Records: వరుస విజయాలతో దూసుకెళ్లున్న చెన్నై సూపర్ కింగ్స్ తో వరుస ఓటములు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్డేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది.

ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ఆ తరువాత వరుస విజయాలతో టోర్నీలో దూసుకెళ్తోంది. మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించి టోర్నీ నుంచి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టేలా ఉంది.

రికార్డులు చూద్దాం..

  1. ఇప్పటి వరకూ ఐపీఎల్ 2021 లో  రెండు జట్లు 14 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి ఇందులో చెన్నై టీమ్ 10 మ్యాచ్‌ల్లో, హైదరాబాద్ టీం 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
  2. హైదరాబాద్‌‌పై చెన్నై టీం చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు. అలాగే చెన్నైపై హైదరాబాద్ టీమ్ చేసిన హై స్కోరు 192 పరుగలు మాత్రమే.
  3. శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్ లో 50 వికెట్లు సాధించాడు. అలాగే కేన్ విలియమన్స్ ను పెవిలియన్ కు పంపడంలో శార్దుల్ బెస్ట్ ఆప్షన్ గా చెన్నై టీం ఆలోచిస్తోంది. ఇంతకు ముందు శార్దుల్ బౌలింగ్ 33 బాల్స్ ఎదుర్కొన్న కేన్ మామ 38 పరుగులు చేసి, రెండు సార్లు ఔటయ్యాడు.
  4. ఈ సీజన్‌లో భయంకరమైన ఆరంభం నుండి కోలుకోవాలని SRH యొక్క బ్యాటింగ్ ఇన్నింగ్స్‌పై డేవిడ్ వార్నర్ నియంత్రణ సాధించడానికి మంచి సమయం లేదు. అతను ఎనిమిది ఇన్నింగ్స్‌లలో సిఎస్‌కెపై ఐదు 50-ప్లస్ స్కోర్‌లను కలిగి ఉన్నాడు మరియు వాటిని 151.97 స్ట్రైక్ రేట్‌లో కొట్టాడు.
  5. చెన్నై టీంపై డేవిడ్ వార్నర్ 151.97 స్ట్రైక్ రేట్‌ తో ఐదు సార్లు 50+ స్కోర్స్ నమోదు చేశాడు. మరోసారి తన సత్తాను చాటితే చెన్నై పై విజయం ఖాయంగా కనిపిస్తోంది.
  6. ఐపీఎల్‌లోని అన్ని టీం బౌలర్ల కంటే చెన్నై పై రషీద్ తక్కువ సగటు, తక్కువ ఎకానమిని కలిగి ఉన్నాడు.
  7. అంబటి రాయుడు ఎస్‌ఆర్‌హెచ్‌పై 15 ఇన్నింగ్స్‌లలో 496 పరుగులు చేశాడు. 45.09 సగటుతో 132.27 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు.
  8. కేన్ విలియమ్సన్ CSK పై 8 ఇన్నింగ్స్‌లలో 301 పరుగులు చేశాడు. 43.00 - సగటుతో 139.35 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు.
Tags:    

Similar News