IPL 2022: 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నై.. ఆదుకున్న ధోనీ, జడేజా...

IPL 2022: చివరి 5 ఓవర్లలో 58 పరుగులు జోడించిన ధోనీ, జడేజా...

Update: 2022-03-27 02:30 GMT

IPL 2022: 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నై.. ఆదుకున్న ధోనీ, జడేజా...

IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ధోనీ ధనాధన్ ఆటతీరు ఆవిష్కృతమైంది. జట్టు కష్టాల్లో పడడంతో, పాత ధోనీ కనిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను చివరి ఓవర్లలో ఓ ఆటాడుకున్నాడు. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఓ దశలో చెన్నై జట్టు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా ఆదుకున్నారు.

ముఖ్యంగా ధోనీ దూకుడైన ఇన్నింగ్స్ సాయంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ధోనీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో అజేయంగా 50 పరుగులు చేశాడు. అతడికి జడేజా నుంచి చక్కని సహకారం లభించింది. జడేజా 28 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ జోడీ చివరి 5 ఓవర్లలో 58 పరుగులు రాబట్టడం విశేషం. రసెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి బంతిని జడేజా సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి.

అంతకుముందు, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. రాబిన్ ఊతప్ప 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. రాయుడు (15) రనౌట్ కాగా, యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే 3 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రస్సెల్ 1 వికెట్ తీశారు.

Tags:    

Similar News